42 చిన్ననాటి ముచ్చట్లు
నదీ ప్రాంతములలో నివసించువారు నల్లరేగడ మన్నుతో కొందరు తలను రుద్దుకొను అలవాటు గలదు. ఇది చాలా మంచి అలవాటు. ఇప్పుడిప్పుడే పాశ్చాత్యపు స్త్రీలు ఈ రహస్యమును గ్రహించి వాడుచున్నారు.
వీరు మార్కెట్టుకుపోయి కూరగాయలనుకొని తెచ్చుకొను అలవాటు లేదు. దినము పొరిచె కొళంబు, తియ్య చారు, కాల్చిన అప్పడము, యెండు దబ్బకాయ వూరగాయ వీనితో రెండుపూటలు భోజనమును ముగింతురు. ఈ సాత్వికాహారముతో వీరి ఆరోగ్యమును కాపాడుకొను చుండిరి. ఎప్పడైనను మందు కావలసి వచ్చినపుడు నేను కొలువుండిన శ్రీ కన్యకాపరమేశ్వరి ధర్మవైద్యశాలకు వచ్చి మందులను పుచ్చుకొనుచుండిరి. అయ్యరు చీటికి మాటికి 'మంగళం, మంగళం' అని పిలుచుచు చీట్లపేకను ఆడుకొనుచు కాలమును కులాసగ గడుపుకొనుచుండిరి.
ఇక మా తెలుగాబిడ సంగతి వ్రాసెదను. ఈబిడ వంగవోలు ప్రాంతమునుండి వచ్చినది గనుక ఆ పల్లెటూరి ఆచారము ననుసరించి తన వంటయింటిని ప్రతిదినము మట్టి పేడతో మెత్తి అలుకుచుండినది. ఇందువలన వంటయింటిలో కాలుపెట్టిన దిగబడుచుండెను. ఈమె వంటయింటి నిండుగ ముగ్గులు వేయుచుండెను. మా యిరువురి వంటకు నాలుగు రాతిపొయిలను కూలిచ్చి వేయించినది. మాసమునకు కావలసిన కట్టెలను పిడకలను ఒకే తడవ తెప్పించి పొయిల ప్రక్కనే పేర్చి పెట్టినది. భోజన సామగ్రిని వుంచుకొనుటకు కొన్ని కుండలను తెప్పించి వంట యింటి దక్షిణపుతట్టు కుదుళ్లమీద వరుసగా పెట్టినది. ఒక మూల గుంజిగుంటను, మరియొక మూల దాలిగుంటను యేర్పాటు చేయించినది.
వంటయింటి నిండుగ పుట్లను వ్రేలాడగట్టించినది. ఆ గది నిండుగా పల్లెటూరు పాత్ర సామానును - అనగ నిలువు చెంబులు,