Jump to content

పుట:Chinnanati Muchhatlu K N Kesari 1999 206 P.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

24

5

కేసరీకుటీరం ప్రథమావస్థ

కేసరి కుటీరమునకు మొదట చాలినంత మూలధనము లేక వృద్దికి రాజాలకయుండెను. స్నేహితులవద్ద కొంతడబ్బును తెచ్చిపెడితినిగాని హేరాళముగ వ్యాపారమును చేయుటకు ఆ డబ్బు చాలదాయెను. ఇట్లుండగ మాతోకూడ వైద్యశాలలో పనిచేయుచుండిన కె.బి. రంగనాధయ్యరు వారి అన్నగారి పేరుతో ధన్వంతరి వైద్యశాల నొకదానిని స్థాపించిరి. అయితే వారి వద్దను డబ్బులేక కష్టపడుచుండిరి. అప్పుడు మద్రాసులో ఆయుర్వేదాశ్రమము, కేసరీ కుటీరము, ధన్వంతరి వైద్యశాలయను పేర్లతో మూడు వైద్యశాలలుండెనుగాని యొకరి వద్దను డబ్బులేదు. అప్పుడు రంగనాధయ్యరు నావద్దకువచ్చి, మన యిరువురము కలిసి మందుల వ్యాపారమును చేయుదము; కావలసిన మూలధనమును నా పరిచితులగు రామచంద్రయ్యరు (సుప్రసిద్ధ హైకోర్టు వకీలు) గారిని అడిగి యిప్పించెదనని చెప్పి నన్ను వప్పించెను. అప్పడు కేసరి కుటీరముతో ధన్వంతరి వైద్యశాలను యేకముచేసి కేసరి కుటీరం అను పేరుతోనే మందుల వ్యాపారమును చేయ ప్రారంభించితిమి. కొంతకాలము జరిగెను. చెప్పిన ప్రకారము రంగనాధయ్యరుగారు రామచంద్రయ్యరుగారి వద్దనుంచి డబ్బును తేలేకపోయిరి. వ్యాపారము నిద్రపోవుచుండెను. ఇరువురము భుక్తికి కూడ కష్టపడవలసి వచ్చెను.

అప్పడు వారిని నేను విడిచిపెట్టి వేరుగ నా కేసరి కుటీరం పేరుతోనే వ్యాపారము ప్రారంభించితిని. క్రమముగ నా వ్యాపారము బాగుపడెను. నేను వృద్ధికి వచ్చుటచూచి రంగనాథయ్యరుకు కన్నెఱ్ఱ నాయెను. వారు వకీలుగ