4
కేసరీ కుటీర స్థాపనము
ఉద్యోగమునకై చేసిన పలువిధములైన ప్రయత్నములు విఫలములైన పిమ్మటనే వైద్యమును నేర్చుకొనుటకు ప్రారంభించితిని. చల్లనితల్లి నరసమ్మగారి చేతి ప్రసాదముతో నాకు కాలము గడుచుచున్నది. కాని ఆమె మాత్రము నాకెంతకాలము భోజనం పెట్టగలదు? అనాథ వద్ద ఉచితముగా భోజనం చేయుటు నాకే అవమానముగ తోచినది.
ఆ కాలమున మద్రాసులో తెలుగు బోయీలు చాలామంది యుండెడివారు. వారు మద్రాసు బ్యాంకి, నేషనల్ బ్యాంకి, ఆగ్రా బ్యాంకి మొదలైన బ్యాంకులలో నౌకరుగా ఉండేవారు. అప్పడు మద్రాసు బ్యాంకి బ్రాడ్వేలోను, నేషనల్ బ్యాంకి ఆగ్రా బ్యాంకీలు ఆర్మీనియన్ వీధిలోను ఉండేవి. అక్కడ కొలువుచేసే బోయిూ లందరు ప్రతి ఆదివారము నావద్దకు వచ్చి వారి బంధువులకు జాబులు వ్రాయించుకొని పోయేవారు. కార్డు వ్రాసిన అర్ధణా; కవరు వ్రాసిన ఒక అణా ఇచ్చేవారు. ఈ ప్రకారము నాకు ప్రతి ఆదివారము కొంతడబ్బు వచ్చుచుండెను.
వైశ్యుల ఇండ్లలో పిల్లకాయలకు పాఠములు చెప్పట వల్ల కొంతడబ్బును సంపాదించుచుంటిని. ఈ సంపాద్యము లాధారముగా నరసమ్మగారికి నెలకు రూ. 3-0-0 లు చొప్పన ఇచ్చుచు భోజనము చేయుచుంటిని.
కోమట్ల ఇండ్లలో పిల్లకాయలకు పాఠములు చెప్పుట వలన వార్ల పరిచయము నాకు అధికమైనది. ఆ చనువున వారు అప్పుడప్పుడు నాకు కొన్నిపనులు చెప్పి చేయించుకొనుచుండిరి. ముఖ్యముగా నా యిండ్ల