188 చిన్ననాటి ముచ్చట్లు
ఇందువలన క్రమముగ వీరిని మేము మంత్రవేత్తయని పిలుచుచుంటిమి. ఒక అబ్బాయికి భార్యవద్దనుండి వచ్చిన జాబులో, మీరు మద్రాసుకు వెళ్ళిన పిమ్మట పెద్దబ్బాయి బెంగపెట్టుకొని అన్నమును సరీగా తినడములేదని వ్రాసియుండెను. అప్పడు ఆ అబ్బాయి ఆ సాయంత్రము బండికే రైలెక్కి వూరికి పోయి నెలదినముల పిమ్మట తిరిగి వచ్చెను. ఈ నెలదినములు లాకాలేజీక్లాసులో మరియొక అబ్బాయి వీరిపేరును పిలిచినప్పుడు హాజరు చెప్పచుండెను. ఆ కాలమున ఒకరికొకరు ఇట్లు సహాయమును చేసుకొనుచుండిరి. క్రొత్తగ పెండ్లి చేసుకొనివచ్చినవారు పండగలకు పలుమారు అత్తవారిండ్లకు పోయి వచ్చుచుండిరి. బందరు వీధికి 'లా' కాలేజి దగ్గరనుండినను నడిచిపోవుటకు బద్దగించి బండ్లమీద కాలేజికి పోవుచుండిరి. కొంతకాలము వుద్యోగమును చేసివచ్చి, బి.యల్. క్లాసులో చదువుకొనుచున్నవారు లాంగ్ కోటులు తలగుడ్డలను ధరించుకొని కాలేజికి పోవుచుండిరి. వారమునకొకసారి చాకలి యిస్తిరి బట్టలను తెచ్చుచుండెను. ఆ కాలమున స్వంత క్షౌరం అలవాటు లేదుగనుక తెలుగు మంగలి ప్రతిదినము వచ్చుచుండెను. ప్రతి శనివారము జట్టివాడువచ్చి సుగంధ తైలములతో తలంటిపోసి పోవుచుండెను. దినమునకు మూడు పర్యాయములు రవేసి తమలపాకులను, సుగంధపుపీటిన్ వక్కపొడిని, జింతాను మాత్రలను వాడుకొనుచుండిరి. చదువుకొనుచుండిన ఒక అబ్బాయి వున్నట్లుండి కనుపడకపోయెను. ఆ అబ్బాయి నాకు చాలా ఆప్తుడగుటవలన వూరంతయు వెతికి వేసారి కడపట ఒక అమ్మాయి యింఠిలో చూడగలిగితిని. సాయంత్ర సమయమున అందరు కలసి హైకోర్టు వద్ద యుండు బీచికిపోయి, 7 గంటలకు బైలుదేరి దోవలో యుండు హోటలుకుపోయి వచ్చునపుడు గుజరాతి మిఠాయి అంగడిలో రెండు తీపి, రెండు కారము పొట్లములను కొనుక్కొని యింటికి