176 చిన్ననాటి ముచ్చట్లు
నాట్యకళయందు అభిమానముగల కొందరు యువకులుచేరి జ్ఞానోదయ సమాజముగా నేర్పడిరి. ఈ సమాజమున వృద్ధికి వచ్చినవారు శ్రీ నెల్లూరి నగరాజారావుగారు.
ఉత్తరాది నాటక సమాజములు కొన్ని చెన్నపట్టణమునకు వచ్చి అప్పడప్పడు నాటకములు వేయుచుండువారు.
వీరికిని నెల్లూరివారికిని చాలా భేదమున్నది. ఏనల్గురైదుగురు సుప్రసిద్ద నటులో తప్ప మిగత అందరిది ఒకటే ధోరణి. నెల్లూరువారు పద్యములు చదువునప్పడు తగుమాత్రము సంగీతమునే ఉపయోగింతురు. పద్యమును విడమరచి చదువుటచే సులభగ్రాహ్యమై, వారికిని అభినయానుకూలమై, ప్రేక్షకుల కానందదాయకమై యుండెడిది. ఉత్తరాది వారట్లుగాక పద్యమెత్తుకొనుటలోనే తారకములో నెత్తుకొని, కొంపలు మునిగిపోవుచున్నట్టు వడివడిగా పద్యమంతయు అక్షరములు కొన్నికొన్ని మ్రింగుచు వల్లించి - తుట్టతుదక గిరికీలు త్రిప్పుచు 'తెర న న న' అన్నట్లుగా రాగము విసిరేవారు. దీనివల్ల వారికి అభినయమున కవకాశము కల్గేదికాదు; విసరురాగములలో రాగసాంకర్యము లేకుండా పాడగలిగిన వారు కడుకొద్దిమంది అయితే రానురాను, గోవిందరాజుల సుబ్బారావు, స్థానం నర్సింహారావు ప్రభృతులు ఆ ధోరణిని చాలావరకు మార్చినారు.
యడవల్లి సూర్యనారాయణరావుగారు వస్తుతః స్ఫురద్రూపులు; ఒడ్డు పొడుగుగల ఉన్నతమైన మూర్తిగలవారు. సంస్కృత శ్లోకములను గాని, పద్యములనుగాని, సుష్ఠుగా చదువనేర్చినవారు. చక్కని సంగీతము, మంచి అభినయము; వీరు మైలవరం కంపెనీలో తొలుత సత్యవంతుని పాత్ర ధరించుచుండిరి. అందే వీరికి పేరు ప్రఖ్యాతులు కల్గినది. పిదప శ్రీ కృష్ణ తులాభారమున కృష్ణుడుగాను, పాండవవిజయమున దుర్యోధనుడుగాను