పుట:Chinnanati Muchhatlu K N Kesari 1999 206 P.pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిన్ననాటి ముచ్చట్లు175

యానాదిశాస్త్రి అనే పేరు చెప్పితే 'ఓహో! చాకలిపేరయ్య వేషం వేసేవారా' అంటారు. ఈయన మొదట్లో అమెచ్యూర్సు కంపెనీలోనుండి చిత్రనళీయమున పాత్ర ధరించినవారు. పిదప ఆంధ్రభాషాభిమాని సమాజమునచేరగా శ్రీ శాస్త్రులవారు ఈ సాటి పుదూరిద్రావిడ శ్రోత్రియని - కొలది కాలములోనే చాకలిపేరిగానిని గావించినారు. ఆ కట్టు, ఆ నడక, ఆ అమాయకత్వము, ఆ మాటలో యాస మూడు మూర్తులా చాకలి పేరయ్యయే.

నేలటూరి తిరువేంగడాచార్యులుగారు యుగంధర పాత్ర, ఢిల్లీలో పిచ్చివాడుగ సహా, నటించేవారు. ఆ పాత్ర ధారణము వీరికి ఒప్పినట్టు మరియొకరికి ఒప్పెడిదికాదు.

దొరసామి మేనల్లుడు సుందరరాజంగారు విద్యానాధుడు, బొబ్బిలి రంగరావు పాత్రల ధరించేవారు. విగ్రహపుష్టి; చక్కని కంఠస్వరము గలవారు. అభినయమునను నేర్పరి. వలీఖాన్ పాత్ర ధరించిన రామానుజాచారి, రామదాసయ్యంగార్లును ఎన్నదగినవారే. శాస్త్రులవారు వ్రాసిన 'తురక తెలుగు' వీరి నోట పుట్టినట్లుండేదిగాని, నేర్చినట్లుండేది కాదు. ఉప పాత్రను కోవూరి గోపాలకృష్ణయ్యగారు ధరించేవారు. పురుషుడు స్త్రీవేషము వేసినాడనేమాట అనిపించేదికాదు సరికదా; ఆ వేషమునందు అతని అందచందములు - ఆ 'ఉషా' కన్యకయేనా అనిపించేవి. రంగసామి చిత్రలేఖ వేషము వేయుటకు ముందు గుంటూరు శివకామయ్యగారు ఆ వేషమును ధరించేవారట. వారును చాలా గొప్పగా నటించేవారందరు.

వర్ధమాన సమాజమున చేరగల, ఉద్యోగఫాయీగాని, ఆంధ్రభాషాభిమాని సమాజమున చేరగల పాండిత్య ప్రకర్షలుగాని, లేకున్నను,