162 చిన్ననాటి ముచ్చట్లు
దూరముగ స్థలమును ఏర్పాటు చేసుకొని రామాయణ నాటకమును ఆడేవారు. వారు రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు మొదలైన వేషములు ధరించి నాటకములాడేవారు. మాసినగుడ్డలను, లక్కరంగు ఆభరణములను ధరించేవారు. కాళ్లకు గజ్జెలు కట్టుకొనేవారు. వాటి ఘల్లుఘల్లునకు తోడు తాళము తప్పెటలు వీరికి ప్రక్క వాయిద్యములు.
ప్రతివూరి సమీపమునను మాలవాడ, మాదిగవాడ యని రెండుండును. మాలవారు మాదిగవారికంటె గొప్పవారమని చెప్పుకొందురు. మాలవాడలో శ్రీరాముని దేవాలయమును కట్టుకొని రామభజన చేయుచుందురు. వీరిలో హెచ్చుగా భక్తిపరులైనవారు కొందరు ప్రతినిత్యము మొగము నిండ తిరుమణి శ్రీ చూర్ణములను తులసిపేరులను ధరించి భజనకీర్తనలు పాడుచు మెట్టవేదాంతమును మాట్లాడుచుందురు.
వీధిభాగవతము లాడినవారిలో ముఖ్యమైనవి రెండు జట్టు. ఒకటి : మాగ్రామ సమీపముననే తమ్మవరము అని యొక గ్రామమున్నది. ఆ గ్రామమునుండి వచ్చు తమ్మవరపు బోగము వెంకటస్వామి జట్టు. రెండవది కూచిపూడి బ్రాహ్మణుల భాగవతము జట్టు.
వెంకటస్వామి జట్టులో చేరినవారందరు బోగమువారే. పురుషులు పురుష వేషమును స్త్రీలు స్త్రీ వేషమును ధరించేవారు. వెంకటస్వామి హాస్యమును ప్రదర్శించుటలో చాలా మేధావంతుడు. ఆ నాటక సమాజమంతయు వెంకటస్వామి చేతులలోనే యుండినది. వీరు మా ఊరికి వచ్చినప్పడు పాత కచ్చేరి సావడిలో బస చేసేవారు. పిమ్మట గ్రామకరణమును మునసబును దర్శించి నాటకప్రదర్శనమును యేర్పాటు చేసుకొనెదరు. ఒకనాటి రాత్రి నాటకమునకు ఒక వరహా సామాన్యమైన యేర్పాటు. వీరందరు కలిసి ఇంచుమించు 10 మంది యుందురు. వీరికి