చిన్ననాటి ముచ్చట్లు155
ద్వాహములు జరిపించినారు. వీరి చేతిమీదుగా గుంటూరులో 35 వితంతు వివాహములు జరిపి పుణ్యము గట్టుకొన్నారు. ఆ పిదప నొక బాలికా పాఠశాల నడుపుచు దానిని శారదా నికేతనముగా స్థాపించి స్త్రీ విద్యాభివృద్ధికి తోడ్పడుచున్నారు.
చెన్నపురిలో ఆంధ్ర మహిళాసభను స్థాపించి సర్వశక్తులను సమకూర్చి పెంచి పెద్ద చేసిన శ్రీమతి దుర్గాబాయమ్మగారిని ఎల్లరును వేయినోళ్ల పొగడుచున్నారు. ఈ సభ ఇంతై, అంతై ఇప్పుడొక బ్రహ్మాండ మైనదై, దివ్యతేజముతో ప్రకాశించుచున్నది. ఇందు విద్య గరపుటయేగాక బ్రతుకుదెఱువు మార్గములను కూడ నేర్పుచున్నారు.
ఒకదినమున యామినీ తిలకమ్మగారు వచ్చి వారి శరణాలయమును చూచుటకు నన్ను పిలిచెను. నేను మరునాడు అక్కడికి వెళ్లి చూచితిని. అప్పడా శరణాలయము ఒక చిన్న యింటి యందుండెను. కీలుపాకులో యొక పెద్ద బంగళాతోటను అద్దెకు తీసుకొని ఈ శరణాలయమును అక్కడికి మార్పించితిని. నూలు వడుకుటకు రాట్నములు, గుడ్డలు నేయుటకు మగ్గములు వగైరాలు సమకూర్చి తగు సహాయము చేయు చుంటిని. అక్కడి పిల్లలకు చదువు, చేతిపనులు నేర్చుచుండిరి. అక్కడి పిల్లకాయలను 'కేసరి కుటీరము'నకు పిలుచుకొని వచ్చి తలనూనెలు, పళ్లపొడులు, వార్లచేత తయారుచేయించి, ఇంటింటికి తీసుకొనిపోయి విక్రయించు ఏర్పాటున్నూ చేయించితిని. వార్లకు తగు ఉడుపుల కుట్టించి యిచ్చుచుంటిని. స్వతంత్రముగ జీవించుటకు తగు చేతిపనులను నేర్చించుటకు ప్రయత్నించితిని. అయితే అక్కడి పిల్లలు పెద్దవారై వార్ల యిండ్లు చేరుకొనిరి. శరణాలయమును మూయబడెను. తిలకమ్మగారి కుత్సాహము, దీక్షయు నున్నను ఆమెకు సరియగు మగతోడు లేకపోవుట