Jump to content

పుట:Chinnanati Muchhatlu K N Kesari 1999 206 P.pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

152 చిన్ననాటి ముచ్చట్లు

నేను మద్రాసునకు వచ్చిన కొంతకాలమునకు పంతులుగారు ప్రెసిడెన్సీ కళాశాలకు ఆంధ్రపండితులుగా వచ్చిరి. 1904లో కాబోలు వారా పదవి నుండి విరమించిరి. ఆ మధ్యకాలమున అప్పుడప్పుడు వారిని దర్శించుట తటస్థించుచుండెను. తలపాగా, చాదుబొట్టు, తెల్లని మీసములు గల అప్పటివారి ముఖవిలాసము ఇంకను నాకు మరుపు రాలేదు. పిమ్మట వారప్పుడు చేయుచుండిన స్త్రీజనోద్ధరణ, సంఘసేవల గూర్చి తరచుగ వినుచుంటిని. ఆ కాలమున వారు వ్రాసిన గ్రంథరాజములను నేను చదువుచుంటిని. ఆంధ్రదేశమున స్త్రీ పురుషులు వీరి నవలలను, ప్రహసనములును, నాటకములను విడువక చదువుచుండిరి. విద్యాలయములలోకూడ వీటిని పాఠ్యగ్రంథములుగ నిర్ణయించియుండిరి. ఈ కారణములచే స్త్రీలలో మంచి సారస్వత చలనము కలిగినది. అప్పటి నుండియే మన ప్రాంతమున స్త్రీ విద్యాభివృద్ధికి ప్రారంభమని చెప్పవచ్చును.

వీరు ఆంధ్రదేశమున సంఘసంస్కరణ కార్యక్రమమును తలపెట్టినప్పుడు బాల వితంతువులు మెండుగనుండిరి. ఒక సం|| వయసుగల ఆడపిల్లలకుకూడ వివాహము చేయుచుండిరి. ఇందువలన బాలవితంతువుల సంఖ్య దినదినాభివృద్ధి చెందుచుండెను. అప్పడు ఈ అనాథలకు ఆలన పాలన లేకుండెను. చిన్నబిడ్డలను పెద్దలకు విక్రయించి తల్లిదండ్రాదులు ధనమును గడించుచుండిరి. ఇట్టి విషమస్థితిలో, దైవము వీరేశలింగముగారి హృదయమున ప్రవేశించి స్త్రీ దౌర్భాగ్యమును రూపుమాప ఆయనను ప్రేరేపించెను.

కౌతా శ్రీరామశాస్త్రిగారు బందరు కాపురస్తులు వితంతు వివాహమాడినవారు 'శారద' యను సచిత్ర మాసపత్రికను 1923లో స్థాపించి కొంతకాలము నడిపించియుండిరి. వందేమాతరోద్యమములోను, బ్రహ్మ సమాజప్రచారమునను పనిచేసియుండిరి. కొంతకాలము బందరు జాతీయ