చిన్ననాటి ముచ్చట్లు151
అఖండమును వెలిగించిరి. రాత్రింబవలు భక్తబృందము చేరి రామభజన సలిపిరి. బ్రాహ్మణులు వేదపారాయణమును చేసిరి. గృహలక్ష్ములు భక్తిగీతములను పాడిరి. కర్పూర హోమము జరుగుచునే యుండెను. సాంబ్రాణి ధూపము మందిరమంతయు కమ్ముకొనియుండెను. దర్శనమునకు వచ్చువారికి విరామము లేకుండెను. గవర్నమెంటు మందిరము వైకుంఠముగ మారినది. ప్రతిదినము వచ్చిన జనము శ్రీరంగమున వైకుంఠయేకాదశినాడు ద్వారదర్శనమునకు పోయినవారికంటె నూరురెట్లు అధికముగ నుండవచ్చును. దూర దేశములనుండి అన్నిజాతులవారును కంటనీరు కార్చుచు కడవల నిండుగ మేకపాలను దెచ్చి మహాత్ముని ఆత్మకు నివేదన చేసిరి. రైతుబృందము మేలైన వేరుశెనగలనుదెచ్చి విమానమునకు ముందుబెట్టి మైుక్కుచుండిరి. ధూపదీప నైవేద్యములతో 10 దినములు గవర్నమెంటు మందిరము పవిత్రత చెందినది.
18
కందుకూరి
శ్రీ పంతులుగారు ఆంధ్రమహిళా లోకమునకు చేసిన మహోపకారమును వెల్లడిపరచుచు పలువురు వ్రాసిన వ్యాసములను ఈ మాసపు 'గృహలక్ష్మీ' పత్రికలో కాననగును. శతవార్షిక జన్మదినోత్సవమున వీరిని స్మరించి నమస్కరించి నాకు వీరు చూపిన పరమోత్కృష్ణ సంఘసేవా మార్గమున నేను చేయదగిన స్వల్పవిషయములను, అనుభవములను వ్రాయుచున్నాను.