Jump to content

పుట:Chinnanati Muchhatlu K N Kesari 1999 206 P.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

144 చిన్ననాటి ముచ్చట్లు

తోటలో మంచి మామిడిచెట్లుండెను. పీతర్ (రసపురి) గోవా (బాదామి) మల్ గోవా, ఆవకాయ పెట్టుకొనుటకు పుల్లటికాయలు మొదలగు మామిడిజాతులుండెను.

పనసపండ్ల చెట్టుండెను. ఆ పనసతొనలను విరిచిన కొబ్బరివలె విరుగును. చక్కెరతో సమానమైన రుచిగలది. ఈ పనసపండుతో పాయసమును, హల్వాను తయారు చేసుకొనుచుంటిమి. కాయ లేత తొనలతో వరుగులు వేయించుకొని నిల్వచేసుకొనుచుంటిమి. నేలకు తగులు టెంకాయ గెలలచెట్టు, దాహము దీర్చు యెళనీరు టెంకాయచెట్లు, కొళంబొ జాతి పెద్ద టెంకాయ చెట్లు మొదలగునవి తోటలోనుండెను. ప్రత్యేకముగ చెప్పదగిన వెలగపండ్ల చెట్లుండెను. తెల్లవారగనె చెట్టు క్రిందకి పోయినప్పుడెల్లను వెలగపండు లభించుచుండెను. కపిత్థం సర్వదా పథ్యమనుట వలన ఆ పండునంతయు నేనె తినుచుంటిని. మామడిచెట్లకు పచ్చిమిరియముల తీగెలను అల్లించితిని. ఆ పచ్చి మిరియములను కోసి నిమ్మపండు, వుప్పుతో కలిపి వూరనిచ్చిన ఆరోచకమునకు మంచి మందు.

రోజాపూల చెట్లను పెంచుటకు బెంగుళూరు మంచి స్థలము. అనేకరకముల రోజా పూల చెట్లను తెచ్చి నాటితిని. ఈవూరి తీగె రోజాచెట్టు ప్రశస్థమైనది. దీనిని పందిలిమీద అల్లుబెట్టిన అందముగ నుండును. ప్రతిదినము గంపెడుపూలను కోయుచుంటిమి. మా బంగళాకు 'లోధ్రలాడ్డి' (Lodhra Lodge)యని పెడితిని. బంగళా వీధిగేటు వద్ద నుండి మోటారుషెడ్డుకు 400 అడుగుల పొడవుగల రోడ్డు గలదు. ఈ రోడ్డంతయు నల్లరాళ్లతో పరుపబడినది. ఈపొడుగునను తీగెల పందిటిని (లతాగృహము) నిర్మించితిని. ఈ రోడ్డంతయు సూర్యరశ్మి లేక చల్లగ నుండును. పొడుగాటి మామిడిచెట్లకు ఊగు వుయ్యాలలను అక్కడక్కడ