చిన్ననాటి ముచ్చట్లు139
గీతములు వీనులకు విందొనర్చుచుండును. తేనెటీగలు పూదేనియనుత్రాగి తేనెగూటిని కట్టుకొను చిత్రమును చూచి సంతోషింపవచ్చును. రంగు పక్షులు, రామచిలుకలు ఫలవృక్షములకు తోటలో పాకులాడుట చూడ వచ్చును. వంటరిగ నుండునపుడు పూలచెట్టువద్ద కూర్చుని దానికి శుశ్రూష చేయుచు స్నేహమును సంపాదించుకొని కాలమును శాంతముగ గడపవచ్చును. అనేకులు ఆత్మశాంతికై ఆరామక్షేత్రముల నాశించెదరు. ఆరామమునకు మించిన ఆత్మబంధువులు వేరుగ నుండరని చెప్పవచ్చును.
కావుననే మహర్షులుకూడా ఇహలోక సౌఖ్యముల విడచి అడవులలో తపస్సు చేసుకొనుచున్నను, పుప్పవనమును కేవలము దయాహృదయులై పెంచుదురు. కణ్వమహర్థికి వనలతావృక్షములపైగల ప్రేమాతిశయము లను కాళిదాసు మనోహరముగ రూపించినాడు.
ఎంత సోదరీస్నేహం లేకపోతే - అత్తవారింటికిపోతూ శకుంతల -- వనజ్యోత్స్న అనే లతను తన్ను కౌగలించుకొని అనుజ్ఞ యిమ్మని కోరుతుంది? ఆమె ప్రయాణ సమయాన కణ్వుడు వనదేవతలను ఆమెకు అత్తింటికి వెళ్ళను ఆజ్ఞ యిమ్మని కోరుతాడు.
నాకు చిన్ననాటినుండియు తోటపని యనిన అమిత ఆశ. మా గ్రామములో యున్నప్పుడుకూడ నా పూరింటి చుట్టును కాకర, పొట్ల, చిక్కుడు చెట్లపాదులను, మల్లెచెట్లను, సన్నజాజితీగెను, తీగె సంపెంగను, జామచెట్టును, జడపత్తి చెట్లనువేసి పెంచుచుంటిని. కొతిమిర పాదును, వంగమొక్కలను మిరపనారునువేసి యేటినుండి కావడితో నీరు తెచ్చి వాటికిపోసి పెంచుచుంటిని. పెరుగు తోట కాడలను పెంచుచుంటిని. ఈ చెట్టుకు పెంటదిబ్బమన్నును వేసి బలపరచుచుంటిని. ఈ విద్య నాకు చిన్నప్పటినుండియు అలవడినదే. ఇది మావూరిలో నేర్చుకున్న విద్య. నేను