6 చిన్ననాటి ముచ్చట్లు
వారికికూడా అమిత భయము. ఈ కారణమున మా మేనమామ మాకు సహాయమొనర్ప జాలకుండెను.
ఈ విధముగా సమీప బంధువుల సహాయములేక, స్వయం శక్తిచే సంపాదించి తాను వంటిపూట భుజించి, నాకు వీలువెంట రెండుమూడు పూటలు అన్నము పెట్టుచు నా తల్లి నన్ను కంటిని రెప్పవలె పోషించు చుండెను. అప్పడామె కష్టమును చూడలేక ఆమెతో చెప్పకుండానే మా ఊరినుంచి కాలినడకన మద్రాసుకు చేరినాను.
2
పార్కుఫేర్ పరశురామప్రీతి
మొదటి ముచ్చటలో చెన్నపట్నానికి రాకముందు మా గ్రామంలో ఉండగానే జరిగిన నా చిన్ననాటి సంగతులను చెప్పియున్నాను. ఇకపై చెన్నపట్నం వచ్చిన తర్వాత నేను పెరిగి పెద్దవాడనై, ప్రయోజకుడను కాగలుగుటకు ముందు నా అనుభవములో తెలిసిన కొన్ని విశేషములను చెప్పదలచి, అందొక ఘట్టమును వ్రాయుచున్నాను.
చెన్నపట్నంలో ప్రతి డిశంబరు నెల ఆఖరు వారమున రాణితోటలో (పీపిల్స్ పార్కు) వేడుకలు జరుగుట కారంభమైనవి. వానినే 'పార్క్ ఫేర్ వేడుకలు' అని జనులు పిలుతురు. చెన్నపట్న మీ రాష్ట్రమునకు రాజధాని కదా. వేసవి శెలవులలో రాష్ట్రీయోద్యోగులు పలువురు చల్లదనమునకై ఉదక మండలములకు వెళ్ళుదురు. కావున డిశంబరు శలవులు వేసవి శలవులకన్న