పుట:Chinnanati Muchhatlu K N Kesari 1999 206 P.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిన్ననాటి ముచ్చట్లు129

కేరళదేశమున చనిపోయినవారిని తమ ఇండ్ల తోటలలో దహనము చేయుట ఇక్కడివారికి అమంగళముగాని భయముగాని లేదు. దహనము చేసిన స్థలమును పవిత్రముగ నుంచి ఒక సంవత్సరమువరకు అక్కడ దీపారాధనను చేయుచు మ్రొక్కుచుండెదరు.

కాలడి క్షేత్రము ఆదిశంకరుల జన్మస్థలము. చిన్న గ్రామమైనను రమణీయమగు వృక్షరాజముల మధ్య పెరియారను పేరుగల నదీతీరమున వెలసి ఉన్నది. అక్కడ శంకర శారదా దేవులను ప్రతిష్టించిన చిన్న దేవాలయములు గలవు. శంకరాచార్యుల తల్లిని దహనముచేసిన స్థలమున తులసికోట గలదు. సంస్కృత విద్యార్థులకు పాఠశాల గలదు. యాత్రికులకు ధర్మశాల గలదు.

పరశురాముడు కత్రియులందరిని వెదకి సంహరించిన అనంతరం ఆ పాప పరిహారార్ధము బ్రాహ్మణులకు భూదాన మొనర్చవలెయునని యోచించెనట. ఈ ధర్మబుద్ధితో పరశురాముడు పశ్చిమ సముద్రతీరమున నుండు ఒక పర్వతాగ్రమునుండి తన దివ్యాయుధమగు గండ్రగొడ్డలిని విసిరి సముద్ర మధ్యమునవేయగా ఆ జలములలోనుండి కొండలు, గుట్టలు, చెట్టుచేమలు, నదులు, దొరువులు, పాములు, మృగములు మున్నగువానితో గూడ భూమి పెల్లగిల్లి వైకుబికినది. ఆవిధముగా గొడ్డలి దెబ్బకు పాతాళ లోకమునుండి ప్రతిధ్వనిచేయుచు పైకుబికిన భూభాగమే కేరళదేశము.

ఇట్లు బయటపడిన నిర్జనప్రదేశమగు అరణ్యప్రాంతమును బ్రాహ్మణులకు దానమిచ్చు సంకల్పముతో పరశురాముడు ఆర్యావర్తము నుండి కొందరు బ్రాహ్మణులను రావించి వారికట్టే దానిని దానమొనర్చెను. అయితే ఆ వచ్చిన బ్రాహ్మణులు అక్కడనుండి క్రూరమృగములకు, ఘోరసర్పములకు ఝడిసి సమీపస్థమైయున్న కొంకణమునకు