ఈ పుట ఆమోదించబడ్డది
చిన్ననాటి ముచ్చట్లు125
నుండుటయు, శివప్రీతికరమగు బిల్వపత్రిపూజయు, శాక్తేయమగు శుక్రవారపు కుంకుమ పూజయు స్వామికి జరుగుచుండుటను ఆ పండితులు తార్కాణముగా నుదహరింతురు.
మానుముంతలను, కొయ్యబొమ్మలను, కొన్నిటిని కొనుక్కొని బోడిగుండ్లతో మద్రాసుకు వచ్చితిమి. తీర్థయాత్ర సమారాధనను చేసితిమి. తిరుపతి ప్రసాదమును అందరికిని భోజనకాలమందు పంచిపెట్టి సంతృప్తులమైతిమి.