చిన్ననాటి ముచ్చట్లు121
కుంభకోణం
తిరుచునాపల్లినుండి కుంభకోణం చేరితిమి. ఇక్కడ నా పరిచితులగు దివాన్ బహదూరు భాష్యమయ్యంగారు జడ్జిగ యుండిరి. వారింటిలో బసచేసితిమి. ఆ వూరిలో నాలుగు దినములుండి కావేరి స్నానము, దేవుళ్ల దర్శనము చేసుకొనితిమి.
ఈ కుంభకోణములో 16 దేవాలయములున్నవి; వానిలో - 12 శివునివి; 4 విష్ణువువి. అన్నియు చూడదగినవే. సారంగపాణి (విష్ణు) దేవాలయము చాల గొప్పది. ఇక్కడ గాలిగోపురం సుమారు 150 అడుగులు ఎత్తుండును; మెడ వెనుకకు విరుచుకొనిగాని శిఖరమును చూడజాలము. ఈ స్వామికి రెండు కొయ్యరథములున్నవి. అందొకటి చాలా పెద్దది.
చిదంబరములో యొక నాటుకోటు శెట్టి వారి సత్రములో దిగితిమి. స్నానానంతరము సమయమునకు నటరాజస్వామి దర్శనమునకు పోతిమి. చిదంబర రహస్యమును నటరాజు వైభవమును చూచి ఆనందించితిమి. అప్పడక్కడ నందన్ చరిత్రము తలంపునకు వచ్చెను.
ముఖ్యముగ శ్రీ సరస్వతీబాయి చెప్పు నందన్ చరిత్ర హరికథ జ్ఞాపకమునకు వచ్చి మరియొకసారి నటన సభాపతికి ప్రదక్షిణము చేసి అక్కడనుండి పయనమైతిమి.
చంగల్పట్టు రైల్వేస్టేషన్లో దిగి సమీపమున యుండు పక్షితీర్థమను క్షేత్రమునకు పోయి సత్రములోదిగి శంఖుతీర్ధమున స్నానముచేసి కొండ నెక్కితిమి. సుమారు 11 గంటలకు ఒక పండారము చక్కెరపొంగలిని వండుకొని కొండ పైకి వచ్చి పక్షులను చెయ్యితట్టి పిలుచును. అప్పడు