చిన్ననాటి ముచ్చట్లు111
యాత్రానంతరము తిరుగ ఇంటికి వచ్చుట సందేహముగ నెంచుచుండిరి. స్వగ్రామమునువదలి దోవలో యుండు ప్రతిగ్రామమున బసచేయుచు పాదచారులై పోవుచుండిరి. ఆ కాలమున కాశీకి పోవువారిని ఆదరించి అన్నమిడుచుండిన వారుండిరి. వారిని చాల గౌరవముగ చూచుచుండిరి. యాత్రకు పోవువారు భార్యాభర్తలయిన ఆ దంపతులను ఆదరించి పూజించి పంపుచుండిరి. కాశీయాత్రకు పోయినవారు యాత్రను ముగించుకొని తిరిగి కొంతకాలమునకు తమ స్వదేశమునకు రాగలిగినవారిని చూచి భక్తిపూర్వకమైన ఆదరణతో వార్లకు ఆతిథ్యమిచ్చి సంతృప్తులగు చుండిరి. తిరిగి వచ్చినవారు కాశీకావడిని కట్టుకొని అందులో గంగ చెంబులను, సాలగ్రామములను, శంఖములను, రుద్రాక్ష దండలను, స్ఫటికములను పెట్టుకొని, దానిని మోసుకొనుచు వచ్చుచుండిరి. వీటిని చూచుటకు అనేకులు వచ్చి వారిని దర్శించినప్పడు వాటి మహాత్మ్యములను చెప్పుట విని సంతసించుచుండిరి.
బుద్ధ భగవానుడు లోకోత్తరమగు బౌద్దమతమును ఇక్కడి నుండియే ప్రపంచమునకు ప్రసాదించినది. అద్వైత మతస్థాపకులగు శ్రీశంకరాచార్యులు కాశీక్షేత్రముననే హిందూ మతమును ఉద్దరించినది. వీరశైవులకు స్మార్తులకు శివభక్తి ప్రదమైన శైవమతమును విశ్వనాథస్వామి ఇక్కడనుండియే వేలసంవత్సరములకు ముందు ప్రసరింపచేసినట్లు చెప్పుకొనెదరు. వీరవైష్ణవులకు శ్రీ బిన్లు మాధవస్వామి క్షేత్రము మరి అనేక విష్ణుక్షేత్రములు ఇక్కడ స్థాపింపబడియున్నవి. మధ్వమతస్తులకు శ్రీ హనుమంతుని దేవాలయములు గలవు.
జన్మసాఫల్యమునకు గంగాస్నానమొనర్చి రామకృష్ణాది మహనీయుల పాదధూళి సోకిన అయోధ్య, మథుర, బృందావనం, గోకులం మొదలగు