102 చిన్ననాటి ముచ్చట్లు
వుపచారము చేయుటకుగాని నాకు సహాయపడుటకుగాని ఇంటిలో కూలివారు తప్ప మరియెవరును లేకపోయిరి. నా ఉద్యోగము పెద్దది. ఈపరిస్థితులలో నేను రెండవ వివాహమును చేసుకొనుటకు నిశ్చయించితి గాని 43 సం|| వయసుగల నాకు తగువయస్సు వచ్చిన పెండ్లాము యెట్లు లభించగలదు.
కొచ్చిరాజ్యమున కేరళస్త్రీలను బ్రాహ్మణులు వివాహమాడు సాంప్రదాయమున్నదని తెలుసుకొని తిరుచూరులో కేరళస్త్రీని వివాహ మాడితిని. అప్పడామెకు 28 సం|| వయసుండును. ఈమె ఈ వూరిలో ఒక వకీలు కుమార్తె. విద్యావంతురాలు. ఆయుర్వేద వైద్యమునందు పరచయము గలది. ముఖ్యముగ స్త్రీల రుగ్మతలను కనుగొని చికిత్సచేయు నిపుణురాలు. శిశుచికిత్స దెలియును. ఔషధములను చక్కగ తయారుచేయు అనుభవమును గలది. ఓషధి జ్ఞానమున్నది. ఈమె నాయింటికి వచ్చిన పిదప కేసరి కుటీరములో తయారుచేయు ముఖ్య ఔషధములన్నియును ఈమెయే తయారు చేయచున్నది. వైద్యశాలకు వచ్చిన స్త్రీలను, బిడ్డలను పరీక్షించి చికిత్స చేయుచున్నది. క్రమముగ ఆఫీసు పనులను నేర్చుకొనినది. ఇంటి పనులను మెళకువతో గమనించుచు నాకు తోడునీడ అయినది. ఇప్పడు నాకు చాలాభారము తగ్గినది. ఈమె పేరు మాధవి,
ఈమె నాయింటికి వచ్చిన మరుసటి సంవత్సరమున నాకు కుమార్తె పుట్టినది. కుమార్తె పేరు శారదాదేవి. ఈ కుమార్తెకు యుక్తవయస్సు రాగానే వివాహ ప్రయత్నమును చేయవలసి వచ్చినది. తిరుచూరుకు సమీపమున సుప్రసిద్ధి క్షేత్రము గురువాయూరు గలదు. ఇది విష్ణుక్షేత్రము. మన ప్రాంతమున తిరుపతి వెంకటేశ్వర కొండ యెంత ప్రసిద్ధియో కేరళ