చిన్ననాటి ముచ్చట్లు101
విద్యార్థులను జూచిన నాకు ప్రేమ అధికము. పేద విద్యార్థులకు చాలమందికి చదువు చెప్పించితిని. విద్యార్థినులను, B.A.M.A. వరకు చదివించితిని. వారందరు కూడ మంచి ఉద్యోగములలో యున్నారు. నేను వారిని చూచినప్పుడు ఆనందించుచుందును. పరులకు చేసిన మేలును చెప్పుకొనకూడదను న్యాయము నాకు దెలిసినను, ఈ సందర్భములో చెప్పవలసి వచ్చినది.
13
ద్వితీయం
నాకు 43 సం|| వయసు అయినది. రోగపీడితురాలయిన భార్య యింట యున్నది. ఇంటిలో మరి యెవరును లేరు. నాకు కొంత ఆస్తి, ఇల్లు, వ్యాపారము చేకూరినది. సంతానము లేదు. సంపాదించిన సొత్తునకు వారసులు లేరు. ఈ సమయమున నా బావమరిది కొడుకును దగ్గర తీసితిని. వాడు చనిపోయెను. పిల్లవాడు చనిపోయిన వెంటనే మాకు విరక్తిభావము మనసునకుతోచి ఇరువురము తీర్థయాత్రలకు ప్రయాణమైతిమి. ఉత్తర దక్షిణ యాత్రలన్నియు మూడు మాసములలో ముగించుకొని యిల్లు చేరితిమి. నా భార్య జబ్బు దినదినాభివృద్ధి యగుచుండెను.
సంతానముకొఱకు మేము తీర్థయాత్రలన్నియును ముగించుకొని యిల్లు చేరితిమి. నాకు సంతానాపేక్ష అధికమగుకొలది నా భార్యకు జబ్బు కూడ అధికమై లేవలేనంత స్థితికి వచ్చి మంచమెక్కెను. ఆమెకు