పుట:China japan.pdf/92

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


83
2 వ అనుబంధము

జర్మనీ తన పౌరషమును తిరిగి జూపి ప్రాపంచకంలో తానుకూడ మరో సామ్రాజ్యమునకు తీసిపోనని తెలుపు టకు హిట్లరునియంతకు 1933లో పరిపాలన వశపరచెను.అప్పటినుంచి హిట్లరు నియంత వెర్సల్లీసు సంధి ద్వారా ఏర్పడ్డ క్రొత్తదేశాలలో, 1లితూనియో 2 డాన్‌జిగ్‌ 3 పోలండు 4 జెకోస్లోవియా 5 అస్ట్రియా 6 హంగేరీ 7 రుమేనియా 8 యుగోస్లోవియా దేశాలను తనలో ఏకం చేసుకొనుటకు నేడు యత్నించుచుండెను.ఈ దేశాలను జర్మనీ నుండి వెర్సల్లీసు సంధిలో విడదీసి వేరువేరు దేశాలుగ ఏర్పటుచేసి అంతర్జాతీయ సంఘంలో ప్రాతినిధ్యం యిచ్చి ఫ్రాన్సు, ఇంగ్లీషు, అమెరికా వారు పెట్టుబడి పెట్టి రాజ్యాలను నడుపుకోమని చెప్పిరి.ఇతర దేశాల పెట్టుబడి వీరికి చాలదు. స్వతహాగా ఆర్థికంగా నిలబడేస్థితిలో లేవు.పైగా ఈ దేశాలలో దిగువరీతిగ జర్మనీ వారున్నారు.

  • లట్ లియాలో.................75,000
  • డాన్‌జిగ్‌.....................360,000
  • పోలండు....................1,350,000
  • జెకోస్లోవియా.................3,500,000
  • ఆస్ట్రియా....................6,300,000
  • హంగరీ.....................600,000
  • రుమేనియా..................800,000
  • యుగోస్లోవియా................700,000