పుట:China japan.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2 వ అనుబంధము

81

ఇటలీ

జపాను వలెనే ఇటలీకూడ తనపూర్వపు ఔన్నత్యమును నిలబెట్టుకొనుటకు జనాభాను పెంచుకోవలసి వచ్చెను.1816 లోఇటలీలో రమారమి 2 కోట్లే జనాభావున్నారు.అప్పటినుంచి తన జనాభాను యిా దిగువరీతిగ వృద్ధిజేసికొనెను.

సంవత్సరాలు జనాభా సంవత్సరాలు జనాభా
1872 26,801,154 1926 39,349,000
1882 28,459,628 1930 40,759,000
1901 32,475,253 1933 41,806,000
1911 34,674,377 1934 42,217,000
1921 38,033,000 1935 42,621,000

దామాయిషాను ఏడాదికి 4లక్షల చొ||జనాభాను పెంచగలిగెను.

ఇటలీ తన జనాభాకు తగిన ఆర్ధిక సౌష్టవమును కలిగించుటకు ఆఫ్రికా దేశమును,మహమ్మదీయ రాజ్యా లను, క్రమేణ భారత దేశమును కబళించాలనే కాంక్ష పుట్టినది. ఇందుకు తగినట్లుగా ఇటలీని పరిపాలించె మస్సోళినీ నియంత(1935-40)మధ్య మహాసంగ్రామం రాక తప్పదనియు, ఈ యిరువదవ శతాబ్దిలో శాంతి అనేది వుందదనియు చాటుచుండెను.దీనికి తార్కాణమే 1936 లో ఆఫ్రికాలోని అబిసీనియా దేశమును కబళించెను. ఇదివరకే ఆఫ్రికాలో కొన్ని ప్రదేశాలు ఇటలీ