పుట:China japan.pdf/9

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


వంటివారు నేటివరకు కాంగ్రెసుకు చేయుచున్న సత్సేవలను ప్రభుత్వశాఖల ద్వారా ప్రజలందరిలోనికి ప్రసరింపజేయుటయే కదా !

ఆంధ్రదేశములో కాంగ్రెసు యొక్క అఖండవిజయమునకు వీరి "దేశీయగీతములు"ను ఇతర యెన్నికల పాటలును యెంతో సహాయకరములైనవని యెరుగనివారు లేరు. వీరి రచనలు కాంగ్రెసు విజయమున కెట్లు సహాయభూతములైనవో విద్యాశాఖ మూలముగా కావలసియున్న భావి విజ్ఞాన ప్రపోషణము అంతే సహాయభూతములు కాగలవు. పరమేశ్వరానుగ్రహము వలన ప్రస్తుతోన్నత స్థానముల నధిష్టించుచున్న కాంగ్రెసు నాయకులపై ఇటువంటి వారిని జ్ఞాపకముంచుకొని వీరి విజ్ఞానమును నూతన మార్గముల నుపయోగించుకొనవలసిన బాధ్యత యున్నదని చెప్పుట అప్రస్తుతము కాదు. ప్రస్తుతము మద్రాసునందే ఉండుకొన్న వీరికి ఇటువంటి అవకాశములు కల్పించుట కాంగ్రెసువర్గము వారి కర్తవ్యమై యున్నదని మనవి చేయగోరెదము.

రాజమహేంద్రవరము

1-12-37

హిందూస్తాన్ పబ్లిషింగు కంపెనీ (లిమిటెడ్)