పుట:China japan.pdf/88

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


79
2 వ అనుబంధము

వాదతత్వం హెచ్చుగా ప్రచారంలోకి వచ్చి నేడు సామ్యవాదమంటే అన్నిదేశాలలోను బాగా ప్రచారం అవుతోంది. ఈ సామ్యవాదతత్వం ప్రచారంలోనికి వస్తే సామ్రాజ్యకాంక్షతోనున్న జర్మనీ, జపాను, ఇటలీ దేశాలకు వలస రాజ్యాలను సంపాదించుటకు ఆటంకం అగుననే భయంవుంది.

సామ్యవాదమంటే కార్మిక కర్షకులతో ఏర్పడి వారి ఆర్థిక సాంఘికరీత్యా మానవులంతా ఒకేరీతి సౌఖ్యాలను గౌరవాలను అనుభవించాలనే పరిపాలన అన్నమాట.

వలసరాజ్యాలున్న దేశాలవారికి కూడ సామ్యవాదమంటే భయంవుంది.ఎందుచేతనంటారా వలసరాజ్యములలోని ప్రజలలో సామ్యవాదతత్వం హెచ్చినా తమవలస రాజ్యాలను కోల్పోవలసిన స్థితి ఏర్పడుననే భయంవుంది.ఇం దువల్ల ఉన్నదేశాలు లేనిదేశాలు సామ్యవాదమంటే అయిష్టతతో వున్నాయి. లేని దేశాలైన జర్మనీ, జపాను, ఇటలీ, ప్రజలలో మధ్యరకపు ప్రజలే పరిపాలనను తమవశంచేసుకొని అటు శ్రీమంతులను, యిటు కార్మిక కర్షకులను తమ అదపుఆజ్ఞలలో నుంచుకొని శ్రీమంతులచేతధనమును వెచ్చించుతూ కార్మిక కర్షకులచేత వారి శరీరబలమును వలస రాజ్యాలకొరకు పాటుబడుటకు ఖర్చుపెట్టుచూ ఫాసిష్టుతత్వమును అమలులోనికి తెచ్చెను.