పుట:China japan.pdf/87

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


78
చీనా-జపాను

1914-18 యుద్ధములో జపాను, ఇటలీ దేశాలు రెండున్నూ జర్మనీకి వ్యతిరేకంగా ఇంగ్లీషువారితో ఏకమయ్యె ను. యుద్ధానంతరమందు వెర్సిల్లీసు సంధిద్వారా జర్మనీని అన్నివిధాల పీల్చిపిప్పిచేసి ఫ్రాన్సు, ఇంగ్లీషువారే హెచ్చుగా పంచుకొన్నారు.వీరితో పాటు సమానంగా ఆపంచుకోవడంలో ఇటలీ, జపానులను జూడనందున యిా రెండు దేశాలవారికి బ్రిటిషువారన్నా, ఫ్రాన్సువారన్నా అమెరికావారన్నాలోలోన కొంత అయిష్టం లేక పోలేదు. ఈ అయిష్టత వల్లనే యిా మూడు దేశాలు ఏకమై ఫాసిస్టుతత్వంతో సామ్రాజ్యకాంక్షను హెచ్చుచేసుకొని ఇరుగు పొరుగు దేశాలలో లోకువైన వాటిమిాద పడుతున్నాయి.

♦♦♦సామ్యవాదము-ఫాసిజము♦♦♦

1914-18 యుద్ధపు రోజులలో రష్యాదేశము జమిాందార్లు సామ్రాజ్యాధిపతుల ఒత్తిడినుండి తప్పించుకొని సామ్య వాదతత్త్వంతో కూడిన పరిపాలనను ఏర్పాటు చేసుకొనెను.ఈ ఏర్పాటుకు దారితీసిన నాయకులలో లెనిను, ట్రాటస్కీ అనువార్లే ప్రాధాన్యులు.వీరిలో లెనిను చనిపోయెను.ట్రాటస్కీ దేశాంతర గతుడవవలసివచ్చెను.స్టాలిన్ నాయకుడయ్యెను.మున్ముందు సామ్రాజ్యతత్త్వంఉఇక ప్రాపంచకంలో నుండదు,సామ్యవాదతత్త్వం అభివృద్ధి అయి తీరునని వీరు చెప్పిరి.వీరు చెప్పినట్లుగానే అంతవరకు లోలోన అణగివున్న సామ్య