పుట:China japan.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
ఉన్నవి, లేనివి
––––––––
వలస రాజ్యాల సమస్య
––––––––

శనివారపు సుబ్బారావుగారు

(2 వ అనుబంధము)

––––––––

ఉన్న దేశాలు లేని దేశాలు అని 1914-18యుద్ధానంతరం చరిత్రకారకులు వాడుచున్నారు.ఉన్నదేశాలంటే వలసరాజ్యాలున్నదేశాలు.లేని దేశాలంటే వలసరాజ్యాలు లేని దేశాలు.(1)గ్రేటు బ్రిటను,(2)ఫ్రాన్సు,(3)అమెరికా సంయుక్త రాష్ట్రాలు,(4)రష్యా,(5)బెల్జియము,(6)హాలండు,(7)పోర్చుగల్‌ దేశాలు.వీటిలో మొదటి మూడు దేశాలకు వలస రాజ్యాలున్నాయి.అంతేకాక ప్రాపంచికమందున్న అన్ని దేశాలకన్న బాగా బలం గలవయు యున్నాయి.రష్యాదేశము తన సోవియట్టు తత్వంతో వలస రాజ్యాలకై పాటుబడగూడదు. అందువల్ల తనదేశాన్నే అన్నివిధాల బంగారంతో నిండివుండేటట్టుగా చేసుకొంటున్నారు.5,6,7 దేశాలు బాగా చిన్నదేశాలు.అయినా వీటికి వలస రాజ్యాలుండడం వల్ల యివికూడా లెక్కలోనికే వచ్చాయి.లేని దేశాలు అంటే(1)జర్మనీ,(2)జపాను,(3)ఇటలీ.ఈ మూడు దేశాలలో