పుట:China japan.pdf/80

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


1 వ అనుబంధము
♦♦♦చైనాలో మూడు ప్రభుత్వాలు♦♦♦

ప్రస్తుతం చైనాలో మూడురకాల అధికారాలున్నాయి.ఒకటి నాన్కింగు ;రెండు కాంటన్‌;మూడు సోవియట్టు ప్రభు త్వాలు.నాన్కింగు ప్రభుత్వమే పెద్దదిగా ఉంది.దీని తరువాత సోవియట్తు పెద్దది.కాంటన్‌ ప్రభుత్వము చిన్నది. కాంటన్‌ప్రభుత్వము కీ||శే|| సన్‌యెట్టుసేను యొక్క పద్ధతిలో కూడిన ప్రజాస్వామ్య పరిపాలన కావాలంటుం ది.నాన్కింగు ప్రభుత్వములో ప్రస్తుత అధికారులు జపాను ధాటీకి ఆగలేక ఏదోరీతిని జపానుతో సఖ్యత చేసు కోవాలంటూవుంటే అక్కడున్న యువకబృందానికి అదియుష్టము లేనందున యూవుభయులకు యూరీతి అంతః కలహాలునాయి. సోవియట్టులున్నచోట కార్మిక కర్షక ప్రభుత్వాన్నే బలపరచుకుంటూ మిగత యూనాన్కింగు, కాంటను ప్రభుత్వాలకు ప్రాకించి ఏక సోవియట్టు చైనాగా చేయాలనుకుంటున్నారు.చైనాలోని సోవియట్టులకు సోవియట్టు రష్యాయొక్క ఆంతరంగిక బలంవుందని సోవియట్టు రష్యాపై సామ్రాజ్యతత్త్వంతో కూడిన జపానుకు కోపంగా ఉంది.సోవియట్టు రష్యాలోని సామ్యవాదతత్త్వం ప్రక్కనున్న జపానులోనికి ప్రాకితే జపాను యొక్క సామ్రాజ్య ప్రాబల్యమునకు ముప్పుకలుగుతుందను భయంతో చైనానంతటిని జపానుయొక్క సామ్రాజ్యంలోనికి తీసుకొని రష్యాను అణచివుంచాలని జపానుకు ఉంది.చైనా స్వాతంత్ర్య

71