పుట:China japan.pdf/8

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ప్రియతమమగు వ్రతముగ నున్నది. అతను వ్రాసి ప్రకటించిన కీర్తనలకును, ప్రకటించలేక దాచుకోవలసివచ్చిన కృతులకును అంతులేదనవచ్చును. ఆ ప్రవాహమున కదియేసాటి.

ఆంధ్రదిన మాసపత్రికలలో అతను వ్రాయుచుండిన వ్యాసములను బరికించిన వారికి అతని గద్య రచన యొక్క మాధుర్యమును విశాల విషయ పరిజ్ఞానమును తెలిసియేయున్నది. అతను తన పేరును ప్రకటించుకొనకనే "గృహలక్ష్మి", "వాహిని" మొదలగు పత్రికల కొనరించిన వ్యాసరూపక కథారూపక గీతరూపక సేవలు అతీతములు. అయినను అతని సేవలకెల్లయును ఫలము అవసరమున్నన్నాళ్లు ఆదరించబడుటయు, అది తీరిన వెంటనే విస్మరించబడుటయు నగుచున్నది.

1931 లో రాజమహేంద్రవరము నందు రామదాసు కో ఆపరేటివు ఇనిస్టిట్యూటు తరఫున నడుపబడిన గ్రామ పునర్మిర్మాణ తరగతుల కతను ప్రధానాచార్యుడై 80 మంది యువకులకు మంచి శిక్షణము నొసంగిన సంగతి యెల్లరకును దెలియును. ఇటువంటి అనుభవీయుని రచనలు ప్రాథమిక పాఠశాలలలో ప్రవేశపెట్టి, బాలబాలికల డెందముల నుద్దీప్తములు చేసి, భారతదేశము యొక్క ముందు సంతతిని సత్పౌరులుగను, సదాశయులుగను తయారు చేయవలసిన బాధ్యత ప్రస్తుత కాంగ్రెసు మంత్రులపై నున్నదనుటకు సందేహము లేదు. కాంగ్రెసువారికి ప్రభుత్వశాఖలు వశమైనందుకు సత్ఫలము ఇటు