పుట:China japan.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
జపాను

ఐరోపాలో యుద్ధము జరిగితే జపాను బాగా జుఱ్ఱు కొనఁగలిగినది. ఇప్పుడు వచ్చేది ఒక్క ఐరోపాయుద్ధమే కాక దూరపు ప్రాగ్దేశ యుద్ధము కూడా అగును గనుక జపాను అందులో మునిగిపోవునని పాశ్చాత్యదేశము లూహిం చుచున్నవి.

♦♦♦1937 యుద్ధము♦♦♦

ప్రస్తుతము ఉత్తరచీనాలో చీనా జపానులకు యుద్ధము నడచుచున్నది. పీపింగు, టీన్సీలను మొదలగు నగర ముల నుండి చీనాసేనలు తొలగిపోవలెనని జపాను ప్రకటించెను.చీనాసేనలట్లు తొలగలేదు.ఆమిష మిాద జపా ను సేనలు చీనాసేనలనెదిరించినవి.చీనా సేనలు పీపింగువద్ద ఒక దేవాలయములోనికి తరుమబడినవి. బ్రిటను రాయబారులు అపాయమునుంది తప్పుకొనుటకు తాపత్రయము పడుచున్నారు.చీనా సేనలకు జనరలు సంగు చయను అధికారి.అతనికి నాంకింగు ప్రభుత్వము కావలసిన సహాయమునెల్లచేయుచున్నది.టంగుచౌ నగర మువద్ద 500 చీనావారు మరణించిరి. టెలిగ్రాముతీగెలు తెంచి వేయబడుటచే అక్కడి వార్తలు స్పష్టముగా బయటకు రాకున్నవి. ఫ్రాన్సు, బ్రిటను,అమెరికాదేశములు శాంతికొరకై ప్రయత్నించవలసినదని చీనా జపాను ప్రభుత్వములకు సందేశముల నంపినవి.అమెరికా జపానుకు తొమ్మొదిరాజ్యముల ఒడంబడిక ప్రకారము వర్తిం చుమని కబురు చేసినది.

67