పుట:China japan.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
జపాను

నానాజాతి సమితి ఆశ చీనాకు లేకున్నచో చీనా దీనినంగీకరించుటా మానుటా యనునదియే చీనా సమస్య.ఈ కారణము వల్లనే జపాను యెన్నిముక్కలు కోసుకొనుచున్నను నాంకింగు ప్రభుత్వము సాధ్యమైనంతవరకు ప్రతి ఘటించి, వీలుతప్పితే అంగీకరించవలసిన గతి పట్టుచున్నది.ఈ పద్ధతి యిష్టము లేకనే ఫ్యూకనులో విప్లవము లేచి కమ్యూనిష్టు ప్రభుత్వము నెలకొల్పబడినది.కాని అది మూడుమాసములు మాత్రమే జీవించి అంతరించిన ది. అయినను 1932 నాటికి అనేక రాష్ట్రములలో శాంతముగా సోవియటుప్రభుత్వము స్థాపించబడినది. చీనా లో యేభాగమునందు సోవియటుప్రభుత్వము స్థాపించబడినను దానినణచివేయుదునని జపాను భీష్మించి నాం కింగు ప్రభుత్వము సహాకారము చేయవలెనని నిర్బంధించుచున్నది.నాంకింగు ప్రభుత్వము ఇందుకు టంగుకూ ఒడంబడిక(1933 మే)ద్వారా అంగీకరించి జపానుకు సహాయము చేయుచున్నట్లే మనము గ్రహించవచ్చును. ఒడంబడికలన్నీ అతిరహస్యముగా జరుగుచున్నవి గనుక యేసంగతిగాని తెలిసికొనుటకు సాధ్యముకాదు.

విద్యార్థి ఉద్యమములు

చీనా విద్యార్థులకు కళాశాలలలో జపాను ప్రతికూల భావములు బోధింపబడుచున్నవి.ఊత్తర చీనా, చీనానుండి స్వతంత్రమగుట కాని జపానుప్రతిభ అక్కడ హెచ్చించుండుట కాని వీరికిష్టము లేదు.పీపింగులో 1500 మంది విద్యార్థులు