పుట:China japan.pdf/7

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


పీఠిక

భరతఖండమునకు సన్నిహిత జ్ఞాతులనదగు చీనా, జపాను దేశముల ఆధునిక సంగ్రహ చరిత్రముల నెఱుగవలసిన ఆవశ్యకత ఆంధ్రుల కెంతయో గలదు. ఇందుకై శ్రీ గరిమెళ్ల సత్యనారాయణ గారిని మేము కోరగా, వారు ఈ పొత్తమును వ్రాసి మాకొసంగినందుకెంతయు కృతజ్ఞఉలము.

శ్రీయుత సత్యనారాయణగారిని ఆంధ్రులకు పరిచయము చేయవలసినంత అభాగ్యము మన రాష్ట్రమున కింకను పట్టకున్నను, అతనిని గూర్చి ఒకటి రెండు మాటలిచ్చట వ్రాయుచున్నందుకు పెద్దలు క్షమింతురు గాక ! అతను 1921 లో మన రాజమహేంద్రవరము నందలి గవర్నమెంటు ట్రెయినింగు కాలేజీలో యల్. టి. క్లాసును విడచిపెట్టి, అసహాయోద్యమములోని కుఱికి, "మాకొద్దీతెల్లదొరతనము" మొదలుగా గల అనేక జాతీయ గీతములను వ్రాసి ఆంధ్రులచే పాడించి దేశము నుఱ్ఱూతలూగించిన కవిశిఖామణి. ఆనాటి ప్రభుత్వ వర్గమువారి క్రోధమునకు గుఱియై, సుమారు మూడు సంవత్సరముల దీర్ఘశిక్ష ననుభవించియుండెను. నాటినుండి నేటి వరకును అతనికి మనదేశపు మహిమమును, సదుద్యమములను కీర్తించుచు జనసామాన్యమును ప్రబోధించు చుండుటయే