పుట:China japan.pdf/66

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


జపాను

యాన్‌,షాన్సీ, షాంటంగులలో 90 మిలియనుల ప్రజలున్నారు.అనగా జపాను జనసంఖ్య కంటె 22 మిలియ ను లెక్కువ.వీరు సంవత్సరమునకు 200 డాలర్ల విలువగల విదేశీవస్తువులను దిగుమతి చేసుకొనుచున్నా రు.ఈ సరుకంతా జపానులో తయారైనదే అయిన యెడల అలాభములు కలసివచ్చుటయే కాక రానున్న యుద్ధమునకై మంచూకోలో చేయవలసిన ప్రయత్నములకది యెంతయు ఉపయోగపడగలదు.ఇదిగాక అక్కడ మంచి ఇన్నుము, నూనె, తగరము, రాగి బంగారము గనులున్నవి.అక్కడ మంచి ప్రత్తిపంట పండును. ఆప్రత్తి తన స్వాధీనములో ఉండిన యెడల ఇండియానుండియు అమెరికానుండియు సంవత్సరమునకు400-500 మిలియను టన్నుల ప్రత్తి దిగుమతి అగుటకు అవసరముండదు.అక్కడ పశుసంపద చాలా శ్రేష్ఠమైనది. వాటితోలు ఒలిచి చెప్పులు మొదలగు వస్తువులు తయారుచేసి ప్రపంచమున విరజిల్లవచ్చునని జపాను ఊహ. రెయిల్వేలు సిద్ధముగా ఉన్నవి గనుక రాకపోకలు రక్షణలుకొరకై తడములాడుకొననక్కరలేదు. యుద్ధ సమయ మున జపానుకు ఆహారము పోనీయకుండ చుట్టివేతమని అమెరికా రష్యాలు తలచుచున్నవి.ఉత్తరచీనా రేవులు జపాను చేతులలో వుండిన యెడల ఆపని సాగనేరదు.లోపలి మంగోలియాలోనికి సెంట్రలు ఆసియా లోనికి, టిబేటులోనికి యెగబ్రాక వలెనంటే ఇదిచాలా అవసరము.

55