పుట:China japan.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

54

చీనా-జపాను

రాజ్యస్థాపన అయిన క్రొత్తరికములో మంచూకోకు సంవత్సరమునకు 40 మిలియనుల గాలనుల క్రూడు ఆయి లు కావలసియుండేడిది.దీనిలో 4/5 అమెరికా, బ్రిటను, డచ్చి కంప్నీల వారు ఇచ్చుచుండిరి.జపాను ఈ ఖర్చును భరించలేక కొంత పెట్టుబడి మంచూకోలోనే పెట్టి ఫుషూనుషేలు ఆయిలు తయారుచేయింప నిశ్చయిం చు కొన్నది.తక్కిన విదేశస్థులు ఇది అక్రమమని పెద్ద గోలచేసిరి.కాని జపాను లక్ష్యపెట్టలేదు.మంచూకోలో శాంతి నెలకొల్పుట,ఫ్యాక్టరీలు కట్తుట మొదలైనవన్నీ యెంతకష్టమైనను,జపాను వీటికన్నింటికిని తెగించుకొనుట కొక్కటే కారణము.ముందు మంచూకోలో బైటాయిస్తే క్రమంగా చీనా అంతలోను పెద్దతనం వహింపవచ్చుననియే జపాను యూహ.

మంచూకో వలన జపానుకు ఉత్తరోత్తరా మంచి లాభముగా వుండునే కాని ప్రస్తుతము అవసరములకది చాల దు.సరేగదా ముందుకలిగే లాభములకు ఇప్పుడు చాలావరకు దండుగ పెట్టుకోవలెను.జపాను జనసంఖ్య వెయ్యికి 30 కంటె యెక్కువ యేటాపెరుగుచున్నను వ్యవసాయ తరగతులు మంచూరియాకు వెళ్ళలేదు, వెళ్ళవు.వర్తకములు ఉద్యోగములుచేసి పైపైని తడుముకొనుటయే జపాను ఉద్దేశ్యము.ఇటువంటి పనులకై ఇదివరకే చాలావరకు వృద్ధికి వచ్చిన దేశము అవసరము. మంఛూకో దిగువనున్న ఉత్తర చీనా అనబడు అయిదు రాష్ట్రములును అట్తివి.హొపీయి, చాహారు, స్యూయి