పుట:China japan.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
జపాను
¶¶¶చీనాలో విజయములు¶¶¶

మంచూకో రాజ్యముయొక్క విస్తీర్ణము జర్మనీ, ఫ్రాన్సు,స్విజర్లేండు, ఆష్ట్రియా దేశముల విస్తీర్ణమంత ఉండును. లోపలి మంగోలియాలో దూరుదమన్నను,అమెరికాను ప్రతిఘటింతమన్నను, ఉత్తర చీనాలో మరింత దొలుచు కొందమనను ఈరాష్ట్రము జపానుకు మిక్కిలి అనుకూలించును.

ప్రత్యేక స్వతంత్రరాష్ట్రమను పేరేగాని చక్రచర్తి హెన్రీపూయిా యొక్క కుటుంబ సంరక్షకశాఖ మొదలు సమస్త రాజకీయ సైనిక పోలీసు ఉద్యోగములును జపానువారివే.జపాను వెళ్ళుటకు ముందు మంచూకో దొంగల యము;శాంతికి శూన్యము, పరిశ్రమలు లేవు,వ్యవసాయము తక్కువ.జపాను దక్షిణ మంచూకో రెయిల్వేను తీసుకొని ఇతర రెయిళ్ళను వేయించి,పోలీసు స్టేషనులు పెట్టి శాంతి నెలకొల్పెను.మంచూకోలో నవ నాగరి కత నెలకొల్పేటందుకు 1932లో జపానుకు 29 మిలియనుల యెన్నులైతే,1934 లో 78 మిలియను లైనది.ఏటా ఈరీతినే ఖర్చులు హెచ్చుచున్నవి.మంచూకో రాజ్యస్థాపన సమయమున బ్రిటను, అమెరికా మొదలగు దేశము లకు మంచూకో తలుపు తెరచియుంచి అందరకు లాభములు కలిగిస్తానని సూచించినది కాని ఇంత దండుగ అవడము చూచి ఆతెరచియుంచిన ద్వారములనుండి పూర్వపువారిని వెళ్ళగొట్టుటే కాని క్రొత్తవారిని రానీయ కుండా చూచుచున్నది.