పుట:China japan.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
జపాను

గూర్చి ఆలోచించవలసిన అవకాశమదికాదని ఇవి త్రోసివేయబడినవి.

చీనాలో పాదుకొన్న తొమ్మిది విదేశ ప్రభుత్వములకును వారిలోవారికే పడకపోవుటచేత అందరూ కలసి చీనాకు సరీగా అభివృద్ధి చేతామనే మిషపెట్టి యెక్కువ సమరసగా లాభాలు పంచుకొనుటకై ఒకసభ 1921 సెప్టెంబరు 12వ తేది మొదలు 6-2-1922 వరకు వాషింగటనులో జరిపి ఒక ఒడంబడికకు వచ్చినారు.ఈసభలో పాల్గొ నిన తొమ్మిదిదేశములు అమెరికా సంయుక్త రాష్ట్రములు, గ్రేటు బ్రిటను, ఫ్రాన్సు,ఇటలీ, జపాను,బెల్జియము , హాలండు పోర్చుగలు, చీనా. దీని ప్రకారము చీనాకు ఒక స్వయంవ్యక్తిత్వమున్నదని అంగీకరించారు.నిజం గా చూస్తే జపాను చీనాను యెక్కడ యెక్కువ మ్రింగివేయునో అని కల్పించిన యెత్తే ఇది.జపాను ఈసంగతి తెలుసుకున్నది.జపాను ప్రధాని టనాకా అనునతడు 1926“తనాకా ప్రణాళిక”(టనాకా మేనిఫెస్టో)ను ప్రకటించె ను. చీనాలోను కొరియాలోను జపాను ప్రతికూల తిరుగుబాటులు జరిగెను.వీనిని సహించకే జపాను టనాకా ప్రకటనము చేసెనని కొందరందురు. మంచూరియాలో బలవంతముగా సైన్యమును దింపి ఆక్రమింపవలె ననియే ఈ ప్రకటన సారాంశము.1931 సెప్టెంబరులో మంచూరియా ముఖ్యపట్టణమగు మూక్డెను నగరమును జపాను తీసుకొని మంచూకో రాజ్యమును నిర్మించెను.బ్రిటనుకు ఇది