పుట:China japan.pdf/61

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


50

చీనా-జపాను

విధముగా చీనానిండా సేనలు, ఉద్యోగస్తులు మొదలగువారిని జపాను దించగలిగినది.యుద్ధానంతరమున జర్మనీ వలసరాజ్యమగు చీనాభాగములను చీనాకిచ్చివేయుదురను ఊహలతో చీనామిత్రవర్గమునకు 1,75, 000 మనుష్యుల సహాయమును ఫ్రాన్సు మెసపోటేమియా ఆఫ్రికాలకు పంపెను.కాని యుద్ధానంతరమున మిత్రవర్గమువారు చీనా కోర్కెను తీర్చక అంతకుముందే ఆ ప్రదేశములనాక్రమించుకొనిన జపాను తీసికొనుట కంగీకరించిరి.అయిరోపాయుద్ధము అనాధజాతులకు స్వాతంత్ర్యమును ఎల్లరకు స్వయం నిర్ణయపు హక్కును ఇచ్చునిమిత్తమే జరుపబడినదను ప్రారంభప్రకటలు నమ్ముకొని చీనా యుద్ధానంతరమున ఈ దిగువ అయిదు కోరికలను కోరెను.(1)చీనాలో వివిధ దేశముల లాభముకొరకు ప్రత్యేకప్రదేశములు కేటాయింపబడినవి.వీనిని స్పియర్సు ఆఫ్‌ ఇన్ఫ్లుయెన్సు అందురు.మరే దేశములోను ఇట్లులేదు గనుక వీనిని తీసివేయవలెను.(2)చీనాలో విదేశప్రభుత్వముల సేనలు పోలీసులు ఉండరాదు.(#)తపాలా, టెలిఫోను తంతిశాఖలు విదేశస్థుల స్వాధీనములో ఉండరాదు.($)చీనాలో విదేశీయులకు స్వదేశస్థులకు కంటె మించిన హక్కులు (ఎక్స్ట్రాటెర్రిటోరి యల్ రైట్సు) తొలగించవలెను.(5)విదేశస్థులాక్రమించుకొనిన ప్రదేశములను చీనాకిచ్చివేసి విదేశ వస్తువులపై చీనాకిష్టమై అనుకూలమైన రీతిని సుంకములను విధించుకొన నీయవలెను.ఈ కోరికలు చాలా న్యాయమైనవి, ధర్మమైనవే.కాని వీనిని