పుట:China japan.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
జపాను

పూనుకొన్నచో ముందుగానే అమెరికాతోను ఇతరవిదేశములతోను విరోధమునకు సిద్ధముగా ఉండవలెను. జపానులో యుద్ధమంత్రివర్గములన్నియు ఇందుకనుకూలములు.

రెండవవర్గము అనగా పారిశ్రామిక ప్రభువులును వర్తకశిఖామణులును చీనావాయవ్యభాగమును ముందు స్వాధీనము చేసుకొనవలెనని కోరుచున్నారు.ఈభాగములు సులభసాధ్యములు, ముడిపదార్థసంపూర్ణములు, మంచి కలప దొరకును.కనుక నౌకాశాఖవారు కూడ దీనికే అనుకూలముగా ఉన్నారు.రెండువర్గములవారి యొక్కయు పరంపరాశయము చీనానంతటిని తమ స్వాధీననందుంకొనుటయే.

వాయవ్యచీనాలో ముడిపదార్థములు చౌక, వస్తువులు యెక్కువ చెల్లును కనుక 1931కి పూర్వమే జపాను పెట్టుబడిదారులు అక్కడ అనేక బట్టలమిల్లులు, బొగ్గుగనులు, నూనెమిల్లులు మొదలైనవి పెట్టి లాభములు తీయుచుండిరి.మంచిహక్కులు సంపాదించి ఇదివరకే అభివృద్ధి పొందుచుండిరి.కనుక మంచూరియా సులభముగా సాధ్యము కావచ్చును. ఇది సాధ్యమైనచో అవతల రష్యాకు ఇవతల అమెరికాకు కూడ జపాను ప్రక్కలో బల్లెమై యుండును.

1894 నుంచి జపాను చీనాలో ఒక్కొక్కముక్కను తీసుకొనుచుండెను.ఆ సంవత్సరం డెసెంబరు మాసములోనే ఫార్మోజాను తీసుకొనెను.రష్యా అడ్దుతగులబట్టికాని మం