పుట:China japan.pdf/52

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


జపాను

ములు,వర్తకముల కన్నిటికి వీరు పెట్టుబడి దారులు, ఇతర పరిశ్రమలు,వానిలో ముఖ్యముగా నౌకానిర్మాణ పరిశ్రమ కంతటికిని మిట్సుబీషీ బ్యాంకు పెట్టుబడిదారు.మరిమూడు చిన్న బ్యాంకులును ఇవ్వియును కలసి సాన్వాబ్యాంకు అనుపేరిట ఒక సమ్మేళన బ్యాంకు లేక అమాల్గమేటెడు బ్యాంకుగా ఉన్నవి.

1928 లో వయోజన ప్రాతినిధ్యమేర్పడిన తరువాత ఈరెండు బ్యాంకులును ధనమును విరాళములను విరజల్లి నియోజకవర్గము నంతటిని స్వాధీనము చేసుకొనినవి.ఇవి రెండును ధన ప్రధానములైన పార్టీలే.కాని ధనాధి కారమునకు కూడ ఒకమితమున్నది.ఒక భయంకర పార్టీలేస్తే అది దానికి తలయొగ్గక తప్పదు.జపానులో ఇట్టి టెర్రరిష్టు పార్టీలెన్నో ఉన్నవి.వీటికి కూడా సామురేయి వంశీకులే నాయకులు.వీరు మధ్యయుగము నాటి ఫ్యూడలు ప్రభువుల సంతతి వారు.జెన్యోషా సంఘము(నల్ల సముద్రము సంఘము)1879 ప్రాంతమున కొరియా, మంచూరియా ఫిలిపైను దీవులలో రహస్యముగా యేజంట్లను పెట్టి పనిచేసి ఆదేశమును స్వాధీనము చేసుకొనుటలో కొంత సఫలమైనది.1901 ప్రాంతములో టోయామా అనునతడు కొకూరు యూకేయి,అనేక కాళసర్ప సంఘమును సృష్టించి రష్యాపై విజయమునకు దారి చూపించినాడు.వీరి యేజంట్లు చీనా, ఆఫ్గనిస్తానను, ఫిలిపైనులు, మంచూరియాలలో పని చేయుచుండిరి.మరియొక పార్టీ

41