పుట:China japan.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

30

చీనా-జపాను

(అ) మంచూరియాలో జపాను సామ్రాజ్యమువారి నావిక సైనిక వైమానిక స్థానమునెల్ల నిర్మూలించుట.

(ఆ)“ప్రజల విప్లవ సేన”లో“మంచూకోసైనికులను”లీనము చేసుకొనుట.

(ఇ)“మంచూకో” జపాను ప్రభుత్వముల ఆజ్ఞలనెల్ల తిరస్కరించుట.

(ఈ)“మంచూకో” లో జపాను సామ్రాజ్యహితాభిలాషులగువారి ఆస్తులనెల్ల హరించి జపాను ప్రతికూల యుద్ధకార్యములకై వినియోగించుట.

(ఉ)ప్రజల ప్రచండదీక్షను పెంపొదించి పితూరీయుద్ధములలోనికి వారిని పురికొల్పుట.

(ఊ)గ్రామములలో కర్షకసభలను స్థాపించుట.

(ఋ)శత్రువును ఓడించుటకై కర్షక కార్మిక సైనిక విద్యాధికులను సంయుక్త ప్రతిఘటన సంఘముగా యేర్పాటు చేయుట:మూడు షరతులమీద జపాను ప్రతికూల సంఘములలోచేరుట.వీనిలోమొదటిది, జపాను మంచూకో ప్రభుత్వములతో పోరాడి వారికేవిధముగా లొంగిపోని యేర్పాటులు చేయుట.రెండవది జపాను ప్రతికూల సైనిక రాజకీయ సమరములలో కర్షకకార్మిక సైనికులకు సంపూర్ణ సహాయము చేయుట కంగీకరించుట. మూడవది, ప్రజలను ఆయుధోపేతులుగాచేయుట.