పుట:China japan.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
చీనా

జపాను వస్తువులను,జపానుయుద్ధ పరికరములను చేతులతో తాకనైన తాకమని ప్రతిఘటించిరి. షాంఘక యివాను, జెహోలు నగరములను జపాను అణచివేయ బూనినప్పుడు గనుల పనివారు తమ సుత్తులను, కర్షకులు తమ కొడవళ్ళను పట్టుకొని జపానువారి నెదరించుటకు నిలబడిరి.క్యూమింగుటాంగు సేనలు కూడా తమసేనానులు ఒసంగిన దేశద్రోహకరములగు ఆజ్ఞలను తిరస్కరించి తమ తుపాకులను జపాను వారి మీదకే గుఱిపెట్టిరి.జపాను సామ్రాజ్యతత్వము నెదరించుటకును జాతీయనీతి సంరక్షణమునకును చీనాయంతయు ఒక్క పెట్టున కృతనిశ్చయముతో నిలచియున్నది.

గత రెండుసంవత్సరముల చీనాచర్యలను తిలకించిన వారికి చీనాఉద్యమములో ఈ దిగువ తెలుపబడిన ప్రధానలక్షణములు గోచరింప గలవు;

1.చీనాలో జపాను ప్రతికూల సేన 5 లక్షల వరకు ఉన్నది.ఇందలి సైనికులందరూ కర్షక కార్మికులే.ఫెంగ్టీను నగరము నందలి గనులపనివారలు రైల్వే పనివారలు జపాను ప్రతికూల మంచూరియా పితూరీదారులతో కలసి పోరాడిరి.కొరియాకును కిరీనుపాన్షేకు, హ్వాటీను రాష్ట్రముల తూర్పు పశ్చమ భాగములకును మధ్యనున్న చీనా రాష్ట్రములలోని కర్షక కార్మికులు“జపాను ప్రతికూల జనసముదాయపు సేన ”లో చేరుటయేకాక“ప్రజల వొప్లవ ప్రభుత్వము” నొకదానిని నెలకొల్పిరి.వారు ఈదిగువ ప్రణాళికను అవలంబించిరి.

29