పుట:China japan.pdf/40

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


చీనా

4.దేశద్రోహులుగాను జపానుయేజంట్లుగాను రుజువైనవారి బియ్యము, గోధుమలు మొదలగు అస్తులనెల్లను హరించి నిరుద్యోగులు ,పేదలు, సిపాయీల సహాయమునకై పంచవలెను. 5.దుర్భరమైన పన్నులను తొలగించవలెను. ఆర్థిక వ్యవహారములను నాణ్యపద్ధతిని చక్కచేయవలెను. జాతీయ ఖర్చులను మితము చేసి దూబరా వ్యవహారములను మానివేయవలెను.

6.కూలులు, జీతములు యెక్కువ చేయవలెను.కర్షక కార్మికులయొక్కయు, సిపాయూలు విద్యాధికుల యొక్కయు సంసారములను అభివృద్ధి పరచవలెను.

7.ప్రజలందరకును సామాన్య ప్రాధమిక హక్కులనొసంగవలెను.రాజకీయఖైదీల నందరను విడుదలచేయవలెను.

8.ప్రజలందరకు ఉచితముగ విద్య నేర్పవలెను.పిల్లలకు బడియీడు గడువగానే జీవనోపాధిమార్గములు కల్పింపవలెను.

9.చీనాలో నివసించుచున్న వివిధ దేశీయులకును సమానహక్కులు ఒసగవలెను.చీనాలో నివసించు విదేశీయుల యొక్కయు, విదేశములలో నివసించు చీనాప్రజల యొక్కయు హక్కులను ఆస్తులను ఇండ్లను వృత్తులను సంరక్షించవలెను.

27