పుట:China japan.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

26

చీనా-జపాను

ఒక ప్రచండమైన పక్షము నెలకొల్పవలెనని వారు తెలుపుచున్నారు.వీరందరును కలసి జపాను ప్రతికూల అఖిల చీనాసేనను నిర్మించవలెననిన్ని, అద్ సోవియట్టుల యెఱ్ఱసేనలతోను, జపాను ప్రతికూల మంచూరియా సేనలతోను కలసి జపానును ప్రతిఘటించవలెనని వీరు ఉద్బోధించుచున్నారు.ఈ సంగతులు వీరు 1-8-1935 వ తేదిని చీనా ప్రజలకు గావించిన విన్నపమువలన విశదము కాగలవు.

ఇటువంటి సంయుక్త ప్రజాప్రభుత్వము ఈ దిగువ వివరింపబడిన కార్యములను నెరవేర్చవలెనని వీరు నిర్దేశించుచుచున్నారు.

1.జపాను విజృంభణమును సాయుధబలసమేతముగా నిరోధించవలెను.జపాను ఆక్రమించుకొనిన రాష్ట్రములనన్నింటిని తిరిగీ స్వాధీనము చేసుకొనవలెను.

2.చీనాలో కాటకములు రాకుండాచేయవలెను.నదులకు ఆనకట్టలను కట్టి నీటినిపొలములకు కాలువలద్వారా పారించి వ్యవసాయమునకు నీటియిబ్బంది లేకుండా చేయవలెను.ఎక్కడెక్కడ కాటకము ప్రాకుచున్నను వెంటనే తక్కిన ప్రాంతములవారు సహాయమునకై గడంగవలెను

3.జపాను సామ్రాజ్యమునకు చీనాలో ఎటువంటి ఆస్తులున్నను వానిని హరించి, జపాను ప్రతికూల సమరము లకు వలయు ఖర్చులక్రింద వినియోగించవలెను.