పుట:China japan.pdf/31

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


18

చీనా-జపాను

రెండవ యుద్ధము

అయినను చియాంగు కెయిషేకు నిరాశ చెందలేదు.విదేశ ప్రభుత్వములు అతని అడియాశలను పెంచు చుండెను.వారి యండ చూచుకొని అతను వెంటనే రెండవ యుద్ధమును ప్రారంభించెను.ఈయుద్ధములో కూడ చీనా యెఱ్ఱ సేనలకే జయము సిద్ధించెను.13,28,54 నెంబర్లుగల సుప్రసిద్ధ క్యూమింగుటాంగు దళములు పరాజితములైనవి.ఎఱ్ఱసేనలు కియాంగ్సీ నగరమును స్వాధీనము చేసుకొనెను.తరువాత రాజధాని నగరమగు నాంచాంగు లోనికి ప్రవేశించెను.హూపే,హోనాను జిల్లాలలో సోవియట్టు ప్రభుత్వములను వీరు స్థాపించి నందు వల్ల చియాంగు కెయుషేకు తన సేనలను కియాంగ్సీ రాష్ట్రమునుండి పూర్తిగా తీసుకొని పోవలసివచ్చెను.

మూడవ యుద్ధము

1931 వేసంగి కాలములోనే మూడవయుద్ధము ప్రారంభమాయెను.చియాంగుకెయుషేకు తన ముప్పది దళములను ఒక్కచో ప్రోగుచేసి మూడు మాసములలోగా విప్లవమును రూపుమాపకున్నచో ఆత్మహత్య చేసుకొందునని ప్రతిజ్ఞ చేసెను.మూడవసారి కూడ అతనికి సంపూర్ణ పరాజయమే సిద్ధించెను.విప్లవదళములు కియాంగ్సీ రాష్ట్రము నందలి కెంబో నగరమును స్వాధీనము చేసుకొని పారిశ్రామిక నగరమగు హాంకోను