పుట:China japan.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
చీనా

బూర్జువా, కమ్యూనిష్టు కలహములు

1928 మొదలు 1936 వరకు

1928 మొదలు 1936 వరకు చీనాలో కమ్యూనిష్టు, బూర్జువా పక్షములకు నిరంతర యుద్ధములు జరుగు చునే యుండెను.క్యూమింటాంగు లేక నాన్‌కింగు ప్రభుత్వమునకు చియాంగు కెయిషేకు అధ్యక్షుడు. తక్కిన పక్షములు కమ్యూనిష్టు నాయకుల అధికారము క్రింద ఉండెను.ఈపక్షములు దినదిన ప్రవర్థమాన శక్తియుక్త ములగుచుండెను.వీని నణచుటకు చియాంగుకెయిషేకు 9యుద్ధములకు తక్కువ కాకుండా ఒనరించెను. ఒకయుద్ధమునందును అతనికి జయము కలుగలేదు సరేగదా కమ్యూనిష్టు ప్రభుత్వము క్రిందికి అనేక జిల్లాలుజారిపోవుచుండెను.

మొదటి యుద్ధము

మొదటియుద్ధము 1930 అక్టోబరునుండి 1931 వరకును సాగెను.ఈయుద్ధములో చియాంగుకెయుషేకు స్వయముగా సేనలను నడిపించి మూడుమాసములలో విప్లవకారులను కలికములోనికి కానరాకుండా చేయుదునని ప్రగల్భములు కొట్టెను.కాని టంగుకూ యుద్ధములో అతను పూర్తిగా ఓడిపోయెను.1928 లో 10,000 సైనికులుగల కమ్యూనిష్టుసేన యుద్ధము తరువాత 62,000 వరకు ప్రబలెను.వీరిలో సగముకంటె యెక్కువమందియొద్ద ప్రశస్తమైన ఆయుధములు తుపాకులు ఉండెను. 2