పుట:China japan.pdf/29

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


చీనా

మార్చివేసిరి. 12 వ తేదిని సుచావోచిన్‌ అధ్యక్షత క్రింద కాంటను సోవియటు ప్రభుత్వమును ప్రకటించిరి. సుచావోచిన్‌ దూరముగ నుండుటచేత చాంగుటెయిలే అను సేనాని ఆక్టింగు అధ్యక్షునిగా నియమించిరి;కాని ఇతనిని కూడ యెవరో హత్య గావించిరి.

తరువాత కాంటను కమ్యూను ప్రకటింపబడెను.దీనివల్ల వివిధసంఘములకు వివిధసౌకర్యములు ఈయబడినవి.

కార్మికులకు:దినమున కెనిమిదిగంటలపని, యెక్కువ కూలులు, పనివారల పనులను పనివారే తనిఖీ చేసు కొనుట, నిరుద్యోగులకు తాము ఉద్యోగములోనుండిననాడు తెచ్చుకొనుచుండిన సంపాదనలనుబట్టి నిర్ణయించ బడిన సహాయములు.విప్లవ ప్రతికూల ట్రేడు యూనియనులను రద్దుచేయుట.

కర్షకులకు:భూస్వాములకు భూమిలేకుండచేసి కర్షకుల కందరకును పంచిపెట్టుట, వడ్డీవ్యాపారస్థులకు వీరియ్య వలసిన ఋణములను రద్దుచేయుట, దుర్భరములగు పన్నులనుతీసివేయుట, గ్రామాలలోను జిల్లాలలోను సోవియటు సంస్థలను స్థాపించుట.

సిపాయీలకు:విప్లవపక్ష సైనికికందరికు భూములనిచ్చుట, వారి బసలు దుస్తులు ఆయుధములు మొదలగునవి మేలుతరములుగా చేయుట, వారి జీతములు నెలకు 12 నుండి 20 డాలర్లకు హెచ్చించుట కర్షకకార్మికుల రక్తవర్ణసేన(రెడ్‌ఆర్మీ)ల నేర్పరచుట.

15