పుట:China japan.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

14

చీనా-జపాను

తోనో చేతులు కలుపుకొని వారిని అణచివేయుటకు సంకోచింపరని తేటయైనది.ఇందుకు తగినట్లు వారు కట్టు బాట్లు చేసుకొనప్రారంభించిరి.

కాంటనులో కమ్యూనిష్టు ప్రభుత్వము

1927 ఆగస్టు 1 వ తేదినాటికి ఈ ప్రయత్నములు పూర్తియైనవి.అనేకమంది జాతీయవిప్లవసేనా నాయకులు కూడా వీరిలోనికి వచ్చిరి.కమ్యూనిష్టు సేనానులు యేటిన్‌,హొలంగు అని వారలక్రింద ఈ సేనలు తిరగబడి క్యూమింగుటాంగు పక్షమును కియాంగ్స రాష్ట్రరాజధాని యగు నాంచాంగు నగరమున ఓడించెను. ఆరువారములలోనే క్వాంగుటంగు రాష్ట్రములో స్వాటోనగరము వరకును పోయి ఆనగరమునాక్రమించుకొనిరి. ఈసమయమున క్వాంగుటంగు కియాంగ్సీ రాష్ట్రముల సేనానులు తమలో తాము పోరాడుకొనుచుండిరి.దీని నాధారముగా గొని ప్రజలఉత్సాహము నూత చేసుకొని క్వాంగుటంగు రాష్ట్ర రాజధానియగు కాంతనులో వీరు కమ్యూనిష్టుప్రభుత్వము స్థాపించిరి.

డిసెంబరు 11 వ తేదిని వీరిమీద తిరుగుబాటు లేచెను.కాని కమ్యూనిష్టు పార్టీవారు మధ్యతరగతులవారినుండి ఆయుధములను పెరుకుకొనిరి.పోష్టు,టెలిపోను,టెలిగ్రాపు,పోలీసు బేరక్సు మొదలైన శాఖలన్నింటినీ తమ ఆధీనములోనికి తీసుకొనిరి.క్యూమింటాంగు ఆఫీసులన్నింటినీ కాంటనులోనికి