పుట:China japan.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
చీనా

కటకమైనవి.వస్తువుల వెలలు పడిపోయినవి.క్రొత్తగా దేశాభివృద్ధికై విధించిన పన్నులను ప్రజలిచ్చుకొనలేక పోయిరి; కనుక ఈ పన్నులను ప్రభుత్వము తీసివేయవలసి వచ్చినది.డబ్బు లేకుంటే దక్షిణపక్ష సేనా నాయకులతో యుద్ధము సాగదాయెను.అమెరికాకు ఇట్టిచర్య లిష్టము లేకుండుటచేత అది ఆహారపదార్థములను చీనాకు పంపుట మానివేసెను.ప్రజలు మలమల మాడిపోవుచుండిరి.వెదేశ వ్యాపారము ఈ కారణములవల్లనే క్షీణించినది.డబ్బు కోసం వూహాను ప్రభుత్వము నోటులెక్కువగా వేయించి ఆ పదార్థములకు కృత్తిమపు హెచ్చువెలలు కలిగించెను.ఇందువల్ల పరిస్థితులు మరీ విషమించినవి.అనేకులు ప్రభుత్వపక్షమును వీడి క్యూమిన్‌టాంగు దక్షిణపక్షములో చేరిపోయిరి.ఇందువల్ల ఆపక్షము బలపడి ఒకసేనా నాయకునిక్రింద తిరుగబడి కర్షకసంఘములను ట్రేడుయూనియనులను రద్దుచేసి వందలకొలది వీరి నాయకులను కాల్చివేసెను. ఇది యంతయు మే 21 తేదినాటికే జరిగెను.తక్కిన వామపక్ష నాయకులు కూడ భూస్వాములలోను పూంజీదారు లలోను దూరిపోయిరి.జూలై నాటికి ఈ సంఘములన్నియు అక్రమసంఘములుగా ప్రకటింపబడినవి.

దీనివల్ల చీనాప్రజలకు ఒక్కసంగతి బాగా విశదమైనది.కర్షకకార్మికులు తక్క ఇతలెవ్వరును నిజమైన దేశ స్వాతంత్ర్యమునకై పోరాడరనియు,ఇతరులందరును భాగ్యవంతులతోనో తద్వారా జపానులేక యితర విదేశసామ్రాజ్య ప్రభుత్వముల

13