పుట:China japan.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
చీనా

చావలేదు.ఈ విదేశప్రభుత్వము లనేకములై ఒకటి నొకటి మించిపోకుండా కాచుకొనుచుండుట చేత చీనా సామ్రాజ్య వంశమసలే అంతరించలేదు.మంచూ వంశస్థులక్రింద నింకనూ అది నామమాత్రావశిష్టమై యున్నది ".పరదేశస్థులెట్లు చెప్పితే అట్లుచేయడం,స్వదేశస్థులెట్లు నిందిస్తే అట్లు పడడం,ఇదిరాజవంశం యొక్క గతి.

ఈ రాజవంశం కూడా 1911 వ సంవత్సరం తిరుగుబాటువల్ల తొలగిపోయినది.ఈ సంవత్సరములో చీనా రిపబ్లికు స్థాపించబడినది.అధికారము పౌరుల వశమైనది.అయినను చీనాకష్టము లింతటితో గట్టెక్కలేదు. ముందు రానున్న మహాప్రళయమున కిదియొక సూచనమాత్రమే.

1911లో నెలకొల్పబడిన చీనారిపబ్లిక్కునకు జనరల్ యుఆన్‌షీకేయ్‌ మొట్టమొదటి అధ్యక్షుడు.ఈ రిపబ్లిక్కు స్థాపనకు కూడా పాశ్చాత్యసామ్రాజ్య ప్రభుత్వములే తోడుపడినవి.వారి సహాయముతోనే అధ్యక్షుడు చీనా పరి స్థితులను చక్కబెట్టజూచెను.అంతకు ముందు సన్‌యట్‌సేను నాయకత్వముక్రింద చీనా ఉద్యమమును క్యూమిన్‌ టాంగు పక్షము వారు నడిపించుచుండిరి.దీనికి పాశ్చాత్యసామ్రాజ్యముల అధికారమంటే కిట్టదు.దానిని అణగ ద్రోక్కుటకే ఈ పక్షము కంకణముకట్టుకొని పనిచేయుచుండెను.పాశ్చాత్యప్రభుత్వముల ఆధారముతో చీనా రిపబ్లిక్కును స్థాపించిన యుఆన్‌షిన్‌కేయ్‌ ఈ పక్షమును ధ్వంసముచేసి వారియండ నిలువగలిగెను.

7