పుట:China japan.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

6

చీనా-జపాను

40 వంతులు పట్టుబట్టలు ఫ్యాక్టరీలలోగాక చేతిమగ్గముల మీదనే తయారుచేయవలసి వచ్చుచున్నది. పెక్కు మంది వ్యవసాయజీవులే యైనను మిల్లులలో పనిచేయువారు 2,750,000 మంది గృహపరిశ్రమలవారు 12,000,000 మంది ఉన్నారు.ఈ పరిశ్రమలవారందరూ దగ్గిర దగ్గర నగరములలోను,విదేశస్థుల మిల్లుల లోను జీవించుటచేత వీరికి మంచి ఐకమత్యము,బలము ఉన్నది.పనిచేయు గంటలు తగ్గించుమని, కూలి హెచ్చించు మని.నిరుద్యోగమును తొలగించమని. ఇతర హక్కులిమ్మని,ఇందుకు తగిన శాసనములుండవలెనని వారు నిరంతరాందోళనము చేయుచు పల్లెటిగ్రామములవారిని గూడ ఉద్బోధించి విప్లమును లేవనెత్త జూచు చున్నారు.చీనాదేశమునకు మహత్తరమయిన శక్తిస్వాతంత్రములు రావలెనంటే వీరి ప్రయత్నములవల్లనే వచ్చుననుటకు సందేహము లేదు.

జాతీయ ప్రభుత్వ స్థాపనము

చీనాకు ఈవిధము ఆర్థికదారిద్య్రము,రాజకీయదాస్యము,కాయిక కష్టము ఒక్కముహూర్తమున సంభవించినవి. దీని కంతటికిని విదేశసామ్రాజ్యతత్వ ప్రభుత్వముల చర్యలే కారణములని చీనాప్రజలు గుర్తించిరి.1900లో బాక్సరుతిరుగుబాటు పేరుతో"యుహొచుఆను" అను ఉద్యమము లేచినది.ఈతిరుగుబాటును విదేశ ప్రభుత్వ ములన్నీకలసి అణగద్రొక్కినను ఉద్యమము మాత్రము