పుట:China japan.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
చీనా

కొనుక్కొని వారు దరిద్రులు కాక తప్పకున్నది.విదేశివస్తు ప్రవాహము నఱికట్టు యీ పంటల యెగుమతి నాపుదమని కొందరు ఫ్యాక్టరీల పరిశ్రమల వైపునకు కూడ మరలుచున్నారు.ఫ్యాక్టరీ పరిశ్రమలంటే పెట్టుబడి తోడిమాట.ఈ పెట్టుబడి ద్రవ్యమునుకూడ ఈ ఫ్యాక్టరీదారులు అప్పుచేసి సంపాదింపవలసి వచ్చుచున్నది.ఈ అప్పులిచ్చేవారు కూడా విదేశస్థులే.ఈ అప్పులకు వీరు పద్ద వడ్డీలు విధించుటయేకాక, యెన్నో వాణిజ్య సౌకర్యములను కూడ గుంజుకొనుచున్నారు.ఇంతకు ముందే వీరు చీనాదేశమంతటను తమ స్వంతఫ్యాక్టరీలను పెట్టి లాభములు అనుభవించుచున్నారు గనుక ఆలాభములకు వట్టము రానట్లుగానే యీ సదుపాయములను వారు చేయుచున్నారు.ఇందు వలన చీనాకు మరింత నష్టమే కాని లాభము కలుగకున్నది.

చీనా గనులలో 930,000,000,000టన్నుల బొగ్గు పడివున్నను,సంవత్సరమునకు 28,000,000 టన్నుల కంటె యెక్కువ త్రవ్వుటకు వీలులేకున్నది.1,000,000,000 టన్నుల ఇనుము పడివున్నను, సంవత్సరమునకు 2,500,000 టన్నుల కంటె యెక్కువ త్రవ్వుటకు సాధ్యము కాకున్నది.ఈగనులలో చాలాభాగము మంచూరియా,జహోలు ప్రాంతములందుంటచేత ఆ భాగ్యమును జపాను దోచుకొనుచున్నదేగాని చీనాకు దక్కకున్నది.ఈ కారణములవల్ల సుప్రసిద్ధమైన చీనా నేత పరిశ్రమలలో నూటికి 85 వంతులు ప్రత్తినూలు బట్టలు,