పుట:China japan.pdf/18

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


4

చీనా-జపాను

సమృద్ధిలో దారిద్ర్యము

ఈసంబంధముల వలన చీనాప్రజలు నానాటికి దరిద్రులగుచున్నారు.చీనా వ్యావసాయక దేశమై జీవనాధారములైన పంటలన్నిటినీ యెక్కీదొక్కీ పండించుచున్నను, ఈ పంటయంతయు నేమియగుచున్నదో కాని, చీనావారికి కావలసిన ఫోక్తు ఆహారపదార్థములలోనే నూటికి యెనిమిది వంతులు విదేశములనుండి అవి విధించిన వెలలకు కొనుక్కొన వలసి వచ్చుచున్నది.దీనికి సరిపడునట్లు వ్యవసాయమును వృద్ధిచేయవలె నంటే, భూమికి కొదువలేదు.ఇప్పుడు నూటికి 10 వంతుల భూమి సాగులోవుంటే తక్కిన 90 వంతులూ బీడే, ఈ 90 వంతుల భూమి తక్షణ వ్యవసాయమున కర్హమైనదే అయినప్పటికీ అందుకు తగిన పరికరములే చిక్కకున్నవి.పూర్వపు సాగు కాలువలను జలాధారములను మరమత్తు చేయుంచేటందుకు క్రొత్తవానిని నిర్మించే టందుకు దిక్కులేదు.కొన్ని చేలు యెండలకు మాడి పోతూవుంటే కొన్ని వరదలకు కొట్టుకొనిపోవుచుండెను. పేదలై నిరాధారులైయున్న ప్రజలు ఇట్టి దుర్భర వ్యయప్రయత్నముల కెట్లు పూనుకొనగలరు?అన్యదేశ నిర్బంధ ప్రభుత్వమునకు వీరిని బాగుచేయగల సమర్ధతకాని దీక్షకాని యెట్లు కుదరగలదు?

ఈస్వల్పమాత్రపు ఫలసాయమైనను ప్రజలు అనుభవించగలరేమో అంటే,దానిని అమ్ముకొని విదేశవస్తువులను